టాటా మోటార్స్ అధ్యక్షుడిగా మయాంక్ పారీక్ నియామకం

By Ravi

పుకారే నిజమైంది. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియాలో దాదాపు రెండు దశాబ్ధాలు మారుతి సుజుకి సంస్థలో వివిధ విభాగాల్లో సేవలు అందించిన మయాంక్ పారీక్ (చివరి పదవి మార్కెటింగ్ ఛీఫ్) ఇప్పుడు మరో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం కంపెనీలో చేరారు. మయాంక్ పారీక్‌ను తమ ప్రయాణీకుల వాహన వాణిజ్య విభాగానికి అధ్యక్షుని (ప్రెసిడెంట్)గా నియమించుకుంటున్నట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్‌గా మయాంక్ పారీక్ నియమితులయ్యారని, అక్టోబర్ 1, 2014వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనల అంతర్జాతీయ వ్యాపారానికి సారధ్యం వహిస్తున్న రంజిత్ యాదవ్ బాధ్యతలను మయాంక్ పారీక్ స్వీకరించనున్నారు.

tata motors appoint mayank pareek as president

టాటా మోటార్స్‌లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మయాంక్ పారీక్ ప్యాసింజర్ వాహన వ్యాపారానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరిస్తారు. కార్పోరేట్ స్టీరింగ్ కమిటీలో కూడా ఆయన సభ్యులుగా ఉంటారు. ఆటోమొబైల్ రంగంలో పారీక్‌కు ఉన్న ప్రతిభ తమ కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించగలదని టాటా మోటార్స్ ధీమా వ్యక్తం చేసింది.

మయాంక్ పారీక్ 1982లో బిహెచ్ఈఎల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1991లో మారుతి ఉద్యోగ్ కంపెనీలో చేరారు. ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బి.టెక్ మరియు ఐఐఎమ్ బెంగుళూరు నుంచి ఎమ్‌బిఏ పూర్తి చేశారు. 2003లో పారీక్ మారుతి సుజుకి సేల్స్ ఛీఫ్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Most Read Articles

English summary
Tata Motors today announced the appointment ofMr. Mayank Pareek as President, Passenger Vehicle Business Unit (PVBU). He will join the company on 1st October, 2014 and will take over from Mr. Ranjit Yadav, who will now head the International Business for Passenger & Commercial vehicles.
Story first published: Monday, September 29, 2014, 17:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X