టెల్కో వర్కర్స్ యూనియన్‌తో టాటా మోటార్స్ బోనస్ అగ్రిమెంట్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, టెల్కో వర్కర్స్‌ యూనియన్‌తో బోనస్‌, ఉద్యోగాల స్థిరీకరణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం, శాశ్వత ఉద్యోగులకు బోనస్‌ లభించనుంది. వార్షిక వేతనం లేదా దినసరి భత్యాలలో 10.5 శాతం మేర వచ్చే డబ్బు బోనస్‌గా దక్కుతుంది.

ఈ మొత్తంలో బేసిక్‌, పర్సనల్‌ పే, డిఏలు కూడా కలిసి ఉంటాయి. గడచిన సంవత్సరం కార్మికుల వార్షిక వేతనాలకు అనుగుణంగా ఈ బోనస్‌ వస్తుందని కంపెనీ వివరించింది. ఇక ఉద్యోగాల స్థిరీకరణ జరిగిన కార్మికులు 2013-14లో కంపెనీ అధికారిక జాబితాలో (ఆన్ రోల్స్) ఉన్నట్లయితే ఈ ఒప్పందం మేరకు వారికి కూడా ప్రయోజనాలు చేకూరుతాయి.

దీని ప్రకారం, శాశ్వత ఉద్యోగులలో కనిష్ట వేతనం స్థాయి ఇకపై రూ.14,490 వరకూ ఉంటుంది. అలాగే, గరిష్ట వేతన స్థాయి రూ.31,390 వరకూ ఉంటుంది. వారం రోజుల్లోగా బోనస్‌ మొత్తాన్ని చెల్లిస్తామని, కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ 250 మంది తాత్కాలిక ఉద్యోగులను కంపెనీ శాశ్వత ఉద్యోగుల జాబితాలోకి తీసుకుంటున్నామని టాటా మోటార్స్ తెలిపింది.

Most Read Articles

English summary
Tata Motors signed Bonus and Permanency Agreement with Telco Workers Union. It was mutually agreed that all permanent workmen would be getting an amount equivalent to 10.5 per cent of the annual salary/wages, consisting of Basic + Personal Pay + Dearness Allowance earned by them during 2013-14, a Tata
Story first published: Tuesday, September 16, 2014, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X