టాటా నానో డీజిల్ ఇప్పట్లో రానట్లే; కారణం ఏంటి?

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజల కారు 'టాటా నానో'లో ఓ డీజిల్ వెర్షన్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గత కొంత కాలంగా అనేక పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ప్రస్తుతం టాటా నానో డీజిల్ ప్రాజెక్ట్ అటకెక్కినట్లు తెలుస్తోంది. నానో డీజిల్ ఇప్పట్లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల జెనీవాలో జరిగిన 2014 అంతర్జాతీయ మోటార్ షోలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శ్రీ. రంజిత్ యాదవ్ టాటా నానో డీజిల్ విడుదల గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతానికి నానో డీజిల్ విడుదల గురించి ఆలోచించడం లేదని, పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరల మధ్య ఉన్న వ్యత్యాసం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

Tata Nano Twist

ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవటం, డీజిల్ ధర కూడా క్రమంగా ప్రతినెలా పెరుగుతూ ఉండటంతో ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో పెట్రోల్ కార్ల హవానే కొనసాగుతుంది. ఈ పరిస్థితులో అధిక పెట్టుబడి వెచ్చించి తయారు చేయబోయే డీజిల్ నానో కారును విడుదల చేయటం కాస్తంత రిస్కుతో కూడుకున్న పనే. ఒకవేళ ఈ మోడల్ కూడా పెట్రోల్ నానో మాదిరిగానే విఫలమైతే, కంపెనీ భారీగా నష్ట పోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అధ్యయనం చేసిన టాటా మోటార్స్ ప్రస్తుతానికి టాటా నానో డీజిల్ విడుదలను మరికొంత కాలం వాయిదా వేయాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.
Most Read Articles

English summary
During an interaction with the media at Geneva Motor Show, Mr. Ranjit Yadav, president of Tata Motors Passenger Vehicles Business, commented about the Tata Nano Diesel launch not being in the offing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X