టాటా నానో అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా రికార్డుకెక్కిన 'టాటా నానో', ఇప్పుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది భారతదేశంలో కెల్లా అత్యంత విశ్వసనీయమైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్' ద్వారా వెల్లడించబడిన నివేదికలో టాటా నానో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో భారతదేశంలో కెల్లా అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ బ్రాండ్‌‌గా గుర్తింపు పొందింది.

గడచిన సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ ఏడాది టాటా నానో మరో 50 ర్యాంకులు అధికంగా సంపాధించుకుంది. టాటా నానో తన విశ్వనీయతా సూచీని మరింత పెంచుకుని, వరుసగా రెండవ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. కామ్నిసీంట్ గ్రూప్ కంపెనీ అయిన టిఆర్ఏ ఈ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్, ఇండియా స్టడీ 2014ను ప్రచురించింది.

Tata Nano

ఈ జాబితాలో 284 విభాగాల్లో 1200 బ్రాండ్‌లను లిస్ట్ చేశారు. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా నానో, సెడాన్ విభాగంలో హోండా సిటీలు 2013లోను అలాగే 2014లోను అగ్రస్థానంలో నిలిచాయి. సెడాన్ సెగ్మెంట్లో హోండా సిటీ తర్వాతి స్థానంలో మిత్సుబిషి లాన్సర్ ఉండగా, ఈ జాబితాలోకి కొత్తగా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వచ్చి చేరింది.

ఇకపోతే ఎస్‌యూవీ/ఎమ్‌యూవీ విభాగంలో గడచిన సంవత్సరంలో అగ్రస్థానంలో ఉన్న టాటా సఫారీని ఈ ఏడాది మహీంద్రా స్కార్పియో ఆక్రమించుకుంది. మొత్తం 26 బ్రాండ్లలో 10 హ్యాచ్‌బ్యాక్ విభాగానికి చెందినవి కాగా, 9 ఎస్‌యూవీ లేదా ఎమ్‌యూవీ విభాగానికి చెందినవి మరియు మిగిలిన 7 సెడాన్ విభాగానికి చెందినవి. ఇందులో ఏడు బ్రాండ్‌లు పూర్తిగా కొత్తవి (2014లో జాబితాలో తొలిసారిగా ప్రవేశించినవి).

Most Read Articles

English summary
Tata Nano has been awarded with the title of Most Trusted Automobile in India. The hatchback was rewarded by 'Brand Trust Report', India study. The Indian car has marked a rise of 50 ranks in previous year. They have increased their Trust Index and has hold on to the first spot in the segment for a second year continuous.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X