అయ్యే గేర్‌లో ఉందా.. చూసుకోలేదండీ: కస్టమర్

మొదటిసారిగా కారు కొనడానికి షోరూమ్‌కి వెళ్లే కస్టమర్లలో కొందరు, సదరు కారు గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండరు. ఇదిగో ఈ ఫొటో చూడండి.. అహ్మదాబాద్‌లోని ఓ టాటా మోటార్స్ షోరూమ్ జస్ట్ కారును చూడటానికి వచ్చిన కస్టమర్, డిస్‌ప్లేలో ఉంచిన టాటా జెస్ట్ కారులో ఎక్కి ఇంజన్‌ను స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో కారు గేర్‌లో ఉంది.

ఈ విషయం తెలుసుకోకుండా కస్టమర్ నేరుగా ఇంజన్ స్టార్ చేయటంతో కారు ముందుకు కలిది, అద్దాలను పగలగొట్టుకుంటూ బయటకు వచ్చింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదట. ఈ ప్రమాదంలో ఇటు కస్టమర్ తప్పుతో పాటుగా, షోరూమ్ వారి తప్పు కూడా ఉంది. డిస్‌ప్లేలో ఉంచి కార్లలో కీని కస్టమర్లకు అందుబాటులో ఉంచడమే వారు చేసిన తప్పు. ఏదేమైనప్పటికీ, కార్ షోరూమ్‌కి వెళ్లినప్పుడు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. లేదంటే, ఇదిగో ఇలాంటి అనవసరమైన చిక్కులే వస్తాయి.

Tata Zest

టాటా జెస్ట్ విషయానికి వస్తే.. పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 17.6 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఇది లీటరుకు 23 కి.మీ. మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
It is reported that, one of the customer tried to start the Tata Zest car without noticing that it was in gear and banged it to the glass wall at Cargo Motors, Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X