మూడు వారాల్లో 10,000 బుకింగ్స్ దక్కించుకున్న టాటా జెస్ట్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్'కు మంచి స్పందన లభిస్తోంది. బోరింగ్ ఇండికా, ఇండిగో డిజైన్‌లకు స్వస్తి పలుకుతూ అధునాత టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ హై-ఎండ్ ఫీచర్స్ మరియు స్టయిలిష్ డిజైన్‌తో ఆఫర్ చేస్తున్న ఈ సరికొత్త టాటా జెస్ట్ కొనుగోలు దారులను చక్కగా ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ ఫుల్ డిటేల్స్

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన మూడు వారాల్లోనే 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎక్కువగా టాటా జెస్ట్ డీజిల్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వేరియంట్‌కు ఎంక్వైరీలు వస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోతోంది.

Tata Zest

టాటా జెస్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 17.6 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఇది లీటరుకు 23 కి.మీ. మైలేజీనిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
According to reports, Tata zest compact sedan has received more than 10,000 bookings within just three weeks of launch. 
Story first published: Monday, September 1, 2014, 13:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X