అక్టోబర్ సేల్స్: హోండా అమేజ్‌ని ఓవర్‌టేక్ చేసిన టాటా జెస్ట్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ తొలి కాంపాక్ట్ సెడాన్ టాటా జెస్ట్‌కు కస్టమర్ల ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోంది. ఇది ఈ సెగ్మెంట్లో అధికంగా అమ్ముడుపోతున్న హోండా అమేజ్ అమ్మకాలను సైతం అధిగమించింది.

గడచిన అక్టోబర్ 2014 నెలలో టాటా జెస్ట్ అమ్మకాలు హోండా అమేజ్ అమ్మకాలను ఓవర్‌టేక్ చేశాయి. ఈ సమయంలో టాటా మోటార్స్ 3,524 జెస్ట్ కార్లను విక్రయించగా, హోండా కార్స్ ఇండియా 3,482 అమేజ్ కార్లను విక్రయించింది.

అయితే, ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారే అగ్రగామిగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో హ్యుందాయ్ ఎక్సెంట్ ఉంది. అక్టోబర్ 2014లో మారుతి 17,950 స్విఫ్ట్ డిజైర్ కార్లను విక్రయిస్తే, హ్యుందాయ్ 4,629 ఎక్సెంట్ కార్లను విక్రయించింది.

Tata Zest

టాటా జెస్ట్, హోండా అమేజ్ అమ్మకాల సంఖ్య మధ్య వ్యత్యాసం తక్కువే అయినప్పటికీ, జెస్ట్ అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయనేందుకు ఇదొక చక్కటి ఉదాహరణ. అనేక ఆశలో టాటా మోటార్స్ విడుదల చేసిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్, కంపెనీకి ఆశించిన ఫలితాలను తెచ్చిపెడుతున్నట్లు కనిపించడం లేదు.

వాస్తవానికి టాటా జెస్ట్ కంపెనీ ఇదివరకు ఆఫర్ చేసిన కార్ల కన్నా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉందని చెప్పాలి. మోడ్రన్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, అట్రాక్టివ్ ఫీచర్స్, రివైజ్డ్ ఇంజన్ ఆప్షన్స్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో ఈ కారును తయారు చేశారు. మరి రానున్న రోజుల్లో టాటా జెస్ట్ కంపెనీ ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలుస్తుందా లేక టాటా నానో మాదిరిగా విఫలం అవుతుందా అనేది తెలియాలంటే, మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Most Read Articles

English summary
The newly launched Tata Zest outsold the year-old Honda Amaze in October, 2014 sales.
Story first published: Wednesday, November 12, 2014, 13:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X