ఇండియాకు రానున్న టెస్లా..! మోడల్ ఎస్‌తో 2015లో ఎంట్రీ!

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, గడచిన 2012లో అమెరికాను దాటి యూరోపియన్ మార్కెట్లలోకి ప్రవేశించింది. కాగా.. ఇప్పుడు టెస్లా ఏషియన్ మార్కెట్‌పై కన్నేసింది. ముందుగా చైనాతో ప్రారంభమై ఆ తర్వాత క్రమంగా ఇండియాలో కూడా టెస్సా ప్రవేశించి తమ ఉత్పత్తులను అందించనుంది.

టెస్లా మోటార్స్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీపక్ అహుజా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఇండియన్ ఎంట్రీ ప్లాన్స్ గురించి వెల్లడించారు. టెస్లా‌కు భారత్‌లో మంచి డిమాండ్ లభించగలదని, ఇక్కడి మార్కెట్లో ప్రవేశించేందుకు 2015 సంవత్సరం చాలా ఉత్తమమైనదని ఆహుజా ధీమా వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేమని ఆయన చెప్పారు.


టెస్లా మోటార్స్ నుంచి ఎంత కాలంగానో పెండింగ్‌లో ఉన్న మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రస్తుతం అభవృద్ధి దశలో ఉంది. ఇండియన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఇదొక ఉత్తమమైన మోడల్ అని ఆహుజా విశ్వసిస్తన్నారు. అయితే, ఇదే సమయంలో ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ సరైన మౌళిక సదుపాయాలు కూడా లేవనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటుగా కంపెనీ తమ పాపులర్ ఫ్లాగ్‌షిప్ టెస్లా మోడల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సెడాన్ కారును కూడా ఇండియాకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం మూడు విభిన్న బ్యాటరీ పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో (60 కి.వా., 85 కి.వా., పెర్ఫార్మెన్స్ వెర్షన్ పి85) లభిస్తోంది.

Tesla Model X

టెస్లా మోడల్ ఎస్ 60 కి.వా. వేరియంట్ 302 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 193 కీ.మీ. మరియు దీని రేంజ్ 334 కి.మీ.

టెస్లా మోడల్ ఎస్ 85 కి.వా. వేరియంట్ 362 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 201 కీ.మీ. మరియు దీని రేంజ్ 426 కి.మీ.

టెస్లా మోడల్ ఎస్ 85 కి.వా. పెర్ఫార్మెన్స్ వేరియంట్ 416 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 209 కీ.మీ. మరియు దీని రేంజ్ 426 కి.మీ.

అమెరికాలో ఉండే సూపర్‌చార్జర్ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మోడల్ ఎస్ కారును కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Tesla Made Its Entry Into Europe In 2012 Following its success in its home country, the USA. Now, the California based electric car major is slowing making inroads into Asia, starting with China, where it has already set up a few dealerships.
Story first published: Friday, March 14, 2014, 11:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X