టామ్‌టామ్ నుంచి స్టార్ట్ సిరీస్ నావిగేషన్ డివైజ్‌లు విడుదల

By Ravi

ప్రముఖ ఆటోమోటివ్ నావిగేషన్ పరికరాల తయారీ సంస్థ టామ్‌టామ్ (TomTom) స్టార్ట్ సిరీస్ పేరిట రెండు సరికొత్త స్మార్ట్ పోర్టబల్ నావిగేషన్ (పిఎన్‌డి)లను విడుదల చేసింది. అవి - స్టార్ట్ 20 మరియు స్టార్ట్ 25. ఇందులో స్టార్ట్ 20 పిఎన్‌డి 4.3 ఇంచ్‌ల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది మరియు స్టార్ట్ 25 పిఎన్‌డి 5 ఇంచ్‌ల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

ఇవి ఫిక్స్డ్ లేదా సెమీ-ఫిక్స్డ్ డ్యూయెల్ మౌంట్ సిస్టమ్‌తో లభిస్తాయి. అంటే, వీటిని కావాలనుకుంటే డ్యాష్‌బోర్డులో శాశ్వతంగా అమర్చుకోవచ్చు లేదా విండ్‌స్క్రీన్‌పై తాత్కాలికంగా అతికించుకోవచ్చు. ఈ కొత్త స్టార్ట్ సిరీస్ నావిగేషన్ డివైజ్‌లు భారతదేశంలోని 7300 నగరాలు మరియు పట్టణాలకు దారి చూపుతాయి. మ్యాప్స్ ఇంటర్నల్‌గా స్టోర్ చేయబడి ఉంటాయి కాబట్టి రాష్ట్రం మారినప్పుడు రోమింగ్ చార్జీలు పడవు.


ఈ ఫీచర్‌కు అదనంగా టామ్‌టామ్ స్ట్రీట్ సిరీస్‌తో ఉచిత జీవితకాలపు మ్యాప్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. సంవత్సరంలో నాలుగు సార్లు మ్యాప్స్ అప్‌డేట్ చేయబడుతాయి, ఈ అప్‌డేట్స్ కూడా ఉచితంగానే లభిస్తాయి.

స్టార్ట్ సిరీస్ నావిగేషన్ సిస్టమ్ యొక్క ఫీచర్లలో కొన్ని..
* వాయిస్ గైడెన్స్ (వాక్కు రూపంలో మార్గదర్శకం)
* హిందీ, ఇంగ్లీష్‌తో కలిపి 14 భారతీయ భాషలలో వీది పేర్లను పలికే ఫీచర్
* స్ప్లిట్ స్క్రీన్ అడ్వాన్స్డ్ లేన్ గైడెన్స్
* ల్యాండ్‌మార్క్ నావిగేషన్
* డ్యూయెల్ మౌంటింగ్ ఆప్షన్

ఇందులోని టామ్‌టామ్ ఐక్యూ రూట్స్ టెక్నాలజీ (TomTom IQ Routes) అతి దగ్గ రూట్లను మరియు అత్యంత ఖచ్చితమైన సమయాలను లెక్కించి తెలియజేస్తుంది. దీని వలన సమయం మరియు ఇంధనం రెండూ ఆదా అవుతాయి.


ఇందులో మరో ఆసక్తికరమైన ఫీచర్ మ్యాప్ షేర్ (Map Share) కమ్యానిటీ. ఈ ఫీచర్ వలన డ్రైవర్లు టామ్‌టామ్ మ్యాప్‌లను తమ స్వంత డివైజ్‌లలో పర్సనలైజ్ చేసుకునేందుకు సహకరించడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యాప్ షేర్ కమ్యూనిటీలో మ్యాప్ మార్పులను అందుకునేందుకు మరియు పంచుకునేందుకు ఇది సహకరిస్తుంది.

హెల్ప్ మి (Help Me!) అనేక మరో ఉపయోగకరమైన ఫీచర్ వీటి సొంతం. ఈ ఫీచర్ ద్వారా అత్యవసర సమయాల్లో హాస్పిటల్స్ నుంచి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వరకు అన్ని రకాల స్థానిక అత్యవసర సేవల సమాచారం పొందవచ్చు. ఉదాహరణకు Help Me, Where am I? అనే ఫీచర్ డ్రైవర్ ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నాడో అనే విషయాన్ని తెలియజేస్తుంది.

ఇన్ని విశిష్టమైన ఫీచర్లు కలిగిన టామ్‌టామ్ స్టార్ట్ 20 ధర రూ.9,499గా ఉంటే, టామ్‌టామ్ స్టార్ట్ 25 ధర రూ.10,999గా ఉంది. వీటిని ఆన్‌లైన్ ద్వారా కానీ లేదా కార్ యాక్ససరీ స్టోర్స్ ద్వారా కానీ కొనుగోలు చేయవచ్చు.

TomTom In Car Phone Mount

ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్‌నే మీ నావిగేషన్ డివైజ్‌గా ఉపయోగించుకోవాలనుకుంటే, అందుకు కూడా టామ్‌టామ్ ఓ కొత్త ఇన్-కార్ ఫోన్ మౌంట్‌ను పరిచయం చేసింది. ఈ పరికరానికే చార్జింగ్ సిస్టమ్ మరియు ఓ 2 వాట్ స్పీకర్ ఉంటుంది. ఈ స్పీకర్ సాయంతో వాయిస్ గైడెన్స్ పొందటమే కాకుండా, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ కోసం కూడా చేసుకోవచ్చు. ఈ మౌంట్ సాయంతో మీ ఫొన్‌ను నిలువుగా కానీ లేదా అడ్డంగా కానీ అమర్చుకోవచ్చు.

ఈ పరికరం అధునాతన నాయిస్ అండ్ ఎకో క్యాన్సిలేషన్ సిస్టమ్‌ను కలిగి ఉండి, బ్యాగ్రౌండ్‌లో వచ్చే శబ్ధాన్ని కాలర్‌కు వినిపించకుండా ఉండేలా చేస్తుంది. స్మార్ట్ ఫోన్ కోసం టామ్‌టామ్ హ్యాండ్స్-ఫ్రీ కార్ కిట్ మరియు ఐఫోన్ కోసం టామ్‌టామ్ హ్యాండ్స్-ఫ్రీ కార్ కిట్ ధర రూ.4,990గా ఉండగా, టామ్‌టామ్ స్మార్ట్‌ఫోన్ చార్జర్ అండ్ మౌంట్ ధర రూ.2,999గా ఉంది. ఈ ఐ-ఫోన్ ఇన్-కార్ ఫోన్ మౌంట్ ఐఫోన్, ఐఫోన్ 3జి, ఐఫోన్ 3జిఎస్, ఐఫోన్ 4 మరియు ఐఫోన్ 4ఎస్‌లను సపోర్ట్ చేస్తుంది.

Most Read Articles

Read in English: In-Car Navigation Made Easy
English summary
TomTom, the leading automotive navigation equipment manufacturer, has launched its Start Series smart Portable Navigation Device (PND) series in India - Start 20 and Start 25.
Story first published: Wednesday, May 28, 2014, 17:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X