కొత్త పార్కింగ్ ఫీచర్‌తో రానున్న టొయోటా కార్లు

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటా తమ పోనోరమిక్ వ్యూ మోనిటర్‌కి కొత్త వ్యూయింగ్ మోడ్‌ని చేర్చడం ద్వారా తమ ఇంటెలిజెంట్ క్లియరెన్స్ సోనార్ (ఐసిఎస్) టెక్నాలజీని మెరుగు పరచింది. ఇదొక కొత్త పార్కింగ్ ఫీచర్. ఈ మోనిటర్ ద్వారా డ్రైవర్ కారు చుట్టు ప్రక్కల ప్రదేశాలను చెక్ చేసుకొని, ఇరుకుగా ఉండే ప్రదేశాలలో సైతం కారును సులువుగా పార్క్ చేసేందుకు సహకరిస్తుంది.

టొయోటా వచ్చే ఏడాది నుంచి గ్లోబల్ మార్కెట్లలో విక్రయించనున్న అన్ని మోడళ్లలోను ఈ కొత్త పార్కింగ్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయనుంది. ఇంటెలింజెంట్ పార్క్ అసిస్ట్ ఈ ఐసిఎస్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఆటోమేటెడ్ బ్రేకింగ్ సాయంతో పొంచి ఉన్న ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుంది.

All Toyota Cars To Be Equipped With New Parking Feature

ఇరుకుగా ఉండే పార్కింగ్ ప్రదేశాలలో మల్టీ-పాయింట్ టర్న్ సపోర్ట్ ఫంక్షన్ కూడా స్టీరింగ్‌ను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసి, డ్రైవర్ వాహనం సరిగ్గా పార్క్ చేసేందుకు గాను ముందుకు, వెనుకకు వెళ్లడానికి సహకరిస్తుంది. ఇందులోని మరో ఫంక్షన్ పారరల్ పార్కింగ్ (వాహనాలను సమాంతరంగా పార్క్ చేయటం) చేయడానికి కూడా సహకరిస్తుంది. ఇందులో పాక్షికంగా ఆటోమేటిక్ ఉంటుంది.

ఈ పానోరమిక్ వ్యూ మోనిటర్‌ని సీ-త్రూ వ్యూతో ఇంప్రూవ్ చేశారు. దీని వలన వాహనం చుట్టుప్రక్కర డ్రైవర్ దృష్టి మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుత మూవింగ్ వ్యూతో పోల్చుకుంటే, సీ-త్రూ ద్వారా డ్రైవర్ అడ్డంకులను సులువుగా గుర్తించేందుకు వీలవుతుంది. పార్కింగ్ స్థలాల్లో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఇంప్రూవ్‌మెంట్స్ చేయటం జరిగింది.

Most Read Articles

English summary
Toyota, the Japanese car manufacturer has improved its Intelligence Clearance Sonar (ICS) technology by adding a new viewing mode to its Panoramic View Monitor. The monitor helps the driver to help check his surroundings to avoid minor nicks and bumps while parking or navigating out of tight parking spaces.
Story first published: Wednesday, November 26, 2014, 11:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X