2015లో ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించనున్న టొయోటా

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఇన్నోవాలో కంపెనీ వచ్చే ఏడాది ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మోడల్‌ను ఇండియా, థాయ్‌లాండ్ మార్కెట్లలో కంపెనీ టెస్టింగ్ చేస్తోంది. ఈ మోడల్ ముందుగా థాయ్‌లాండ్ మార్కెట్లో, ఆ తర్వాత ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది.

టొయోటా గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఇన్నోవాలో రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కాగా.. కొత్తగా మార్కెట్లోకి రానున్న కొత్త టొయోటా ఇన్నోవాలో ఉపయోగించే ఎక్కువ భాగాలను ఇండియాలోనే అసెంబ్లింగ్/లోకలైజ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇలా చేయటం ద్వారా సరసమైన ధరకే కొత్త ఇన్నోవాలని అందించాలని టొయోటా భావిస్తోంది.

Toyota To Unveil New Innova In 2015

కొత్త టొయోటా ఇన్నోవాలో కాస్మోటిక్ మార్పులతో పాటుగా మెకానికల్ మార్పులు కూడా ఉండనున్నాయి. మరోవైపు భారత మార్కెట్లో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టొయోటా తమ ఇన్నోవాలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను కూడా పరిచయం చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొత్త 2015 టొయోటా ఇన్నోవా ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, హోండా మొబిలియో, నిస్సాన్ ఇవాలియా, షెవర్లే ఎంజాయ్ వంటి ఎమ్‌పివిలకు పోటీగా నిలువనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Toyota is working on revamping its Innova, which is expected to be launched in 2016, however, it will be showcased in 2015. The MPV has been caught testing both in India as well as Thailand. A few of the parts are manufactured in Thailand and imported to India.
Story first published: Saturday, August 23, 2014, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X