టొయోటా నుంచి డ్రైవర్ అవేర్‌నెస్ రీసెర్చ్ లెహికల్

By Ravi

ఆటోమొబైల్ టెక్నాలజీలో రోజుకో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వస్తోంది. తాజాగా.. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టొయోటా ప్రముఖ ఐటి దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్‌లతో చేతులు కలిపి డ్రైవర్ అవేర్‌నెస్ రీసెర్చ్ వెహికల్ (డిఏఆర్‌వి)‌ను అభివృద్ధి చేశాయి.

'డిఏఆర్‌వి 1.5'గా పిలిచే ఈ కారు డ్రైవర్‌కి అందే సమాచారాన్ని సింప్లిఫై చేయటం ద్వారా డ్రైవర్‌ను అన్నివేళలా అప్రమత్తంగా ఉంచుతూ, డిస్ట్రాక్షన్లను తగ్గిస్తూ, డ్రైవర్ సేఫ్టీని మెరుగుపరచడంలో సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ కొత్త కాన్సెప్ట్ ఓ టాబ్లెట్ పిసి మాదిరిగా పనిచేసి, డ్రైవర్ కారు వద్దకు చేరుకోగానే సైడ్ విండోపై వాతావరణ పరిస్థితులు, ఫ్యూయెల్ స్టేషన్లు, రూట్ వివరాలు మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. అలాగే, కారు లోపల ఉండే డిస్‌ప్లేపై కూడా ఈ వివరాలు కనిపిస్తాయి.

Toyota DARV

క్యాబిన్ లోపల ఈ సిస్టమ్ ఓ కైనెటిక్ మోషన్ సెన్సార్‌ను ఉపయోగించుకొని కారు నడిపే డ్రైవర్‌ను గుర్తించి, లాక్ ఇన్ చేస్తుంది. ఈ సిస్టమ్ వలన కారు నడిపే డ్రైవర్‌ను బట్టి కారులో కొన్ని ఫీచర్లను ఆన్ చేయటం లేదా ఆఫ్ చేయటం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.

టొయోటా డిఏఆర్‌వి 1.5 కారు డ్రైవర్ ప్రవర్తనకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేసుకొని, డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ తీసుకున్న నిర్ణయాలను అధ్యయనం చేసిన తర్వాత సేఫ్టీ రేటింగ్‌ను ఇవ్వటం జరుగుతుంది.

ఈ టెక్నాలజీల వలన ప్రమాదాలను తప్పించడంతో పాటుగా, పర్యావరణాన్ని మెరుగుపరచడం మరియు ఉద్యోగాలను సృష్టించడం సాధ్యమవుతుందని టొయోటా భావిస్తోంది. అయితే, ఇలాంటి ఫ్యూచర్ కార్లు అందుబాటులోకి రావాలంటే దాదాపు మరో దశాబ్ధానికి పైగా సమయం పట్టే ఆస్కారం ఉంది. ఏదేమైనప్పటికీ డ్రైవర్‌ను అధ్యయనం చేసే కార్ టెక్నాలజీ మాత్రం సూపర్ అనే చెప్పాలి. మీరేమంటారు..?

Most Read Articles

English summary
Toyota has teamed up with Microsoft and Infosys for their latest Driver Awareness Research Vehicle (DARV). Called "DARV 1.5", the Toyota Avalon based-car aims to simplify the information coming to the driver, in an age of ever-increasing infotainment and in-car tech.
Story first published: Friday, July 25, 2014, 9:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X