హైదరాబాద్: ఫ్లై ఓవర్లపై నో ఎంట్రీ, ట్రాఫిక్ మళ్లింపు

By Ravi

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు రాజధాని రోడ్లపై పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా హుస్సేన్‌సాగర్ చుట్టుప్రక్కల ప్రాంతంలో డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారు జామున 2 గంటల వరకూ ట్రాఫిక్‌ను అనుమతించరు.

అలాగే, సిటీలోని అన్ని ఫ్లైఓవర్లపై ట్రాఫిక్‌ను నిషేధించనున్నారు. ఎలాంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులను, లారీలను, ఇతర భారీ వాహనాలను రాత్రి పది గంటల తర్వాత అనుమతించరు. నగరంలో ప్రతిచోటా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు.

వివి స్టాచ్యూ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ గుండా వచ్చే ట్రాఫిక్‌ని ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే, బిఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా వచ్చే మోటారిస్టులను ఇఖ్బాల్ మినార్, లక్డీకపూల్, ఆయోధ్య జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.

Traffic Restrictions In Hyderabad

లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ట్రాఫిక్‌ను జిహెచ్ఎమ్‌సి ఆఫీస్ జంక్షన్ వద్ద మళ్లించి బిఆర్‌కె భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అయోధ్య జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీకి వచ్చే వాహనాలను మీరా టాకీస్ లేన్ మీదుగా మళ్లించనున్నారు.

సెక్రటేరియట్‌కు సమీపంలో ఉన్న మింట్ కాంపౌండ్, సంజీవయ్య పార్క్ రోడ్, నెక్లెస్ రోడ్‌లను మూసివేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ క్రాస్ రోడ్స్, లోవర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ గుడి, అశోక్ నగర్ మరియు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు.

Most Read Articles

English summary
In view of New Year's eve, no traffic will be allowed around Hussainsagar between 10 pm on December 31 to 2 am on January 1. Traffic police have imposed restrictions across the city to prevent road mishaps during the New Year celebrations.
Story first published: Wednesday, December 31, 2014, 12:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X