అక్టోబర్ 2017 నుంచి భారత్‌లో వాహన క్రాష్ టెస్ట్ తప్పనిసరి!

By Ravi

భారత్‌లో తయారవుతున్న వాహనాల భద్రత విషయంలో నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. మనదేశంలో తయారైన కార్లు భద్రతా పరంగా సురక్షితమైనవి కావని గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మనదేశంలో కూడా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, వాహనాల భద్రత విషయంలో కొన్ని నిబంధనలను సవరించాలని సర్కారు యోచిస్తోంది.

ఇందులో భాగంగానే, అక్టోబర్ 1, 2017వ తేదీ భారత్‌లో వాహనాలకు క్రాష్ టెస్టులను నిర్వహించడం తప్పనిసరి చేయనుంది. ఇందుకోసం ఇండియన్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ను భారత సర్కారు ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వాహనాల క్రాష్ టెస్టుకు కావల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Vehicle Crash Test Mandatory From 1st October 2017

అక్టోబర్ 2017 నుంచి ఇండియాలో తయారయ్యే ప్రతి కొత్త కార్ మోడల్ కూడా గంటకు 56 కిలోమీటర్ల వేగం వద్ద క్రాష్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావల్సి ఉంటుంది. ఏఐఎస్ 098, ఏఐఎస్ 099 క్రాష్ స్టాండర్డ్స్ ప్రకారం, ఈ టెస్టులను నిర్వహిస్తారు. ఇందులో సేఫ్టీ రేటింగ్‌లను స్టార్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. బిఎన్‌విఎస్ఏపి క్రాష్ టెస్టులో మేడ్ ఇన్ ఇండియా కార్లు ఐదు స్టార్లకు 5 స్టార్స్ లేదా 4-4.5 స్టార్స్ రేటింగ్‌ను దక్కించుకుంటే, అది సురక్షితమైన కారుగా పరిగణించడం జరుగుతుంది.

ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఓ ఇండిపెండెంట్ అథారిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ అథారిటీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కొత్త వాహనాల మోడళ్లను ఎంచుకొని, వాటి భద్రతా పరమైన అంశాలను సమీక్షించేందుకు ఈ టెస్ట్ కోసం పరిగణించడం జరుగుతుంది. మరి ఈ వ్యవస్థ ఎంత మేరకు విజయవంతం అవుతుందో అనేది కాలమే నిర్ణయించాలి.

Most Read Articles

English summary
Vehicle crash test mandatory from the 1st of October 2017, informed GM Siddeshwara, the Ministry of State in the Ministry of Heavy Industries. All the crash test facilities and equipment needed must be ready by December 2015, he informed Lok Sabha.
Story first published: Friday, December 26, 2014, 12:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X