వీడియో: మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్, ఆల్టో కె10 ఫేస్‌లిఫ్ట్ టివిసి

By Ravi

మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల చేసిన స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, కొత్త ఆల్టో కె10 ఏఎమ్‌టి మోడళ్లకు సంబంధించి కంపెనీ రెండు కొత్త టెలివిజన్ ప్రకటనలు విడుదల చేసింది. ఈ రెండు ప్రకటనలలో కంపెనీ తమ కార్ల యొక్క విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేసింది.

మారుతి స్విఫ్ట్‌ని తొలిసారిగా మే 2005లో విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ స్విఫ్ట్ కారు అనేక సార్లు రూపాంతరం చెందుతూ, మరింత మోడ్రన్‌గా, స్టయిలిష్‌గా మారుతూ వచ్చింది. రిఫ్రెష్డ్ వెర్షన్ స్విఫ్ట్‌కు సంబంధించి కంపెనీ విడుదల చేసిన ఈ ప్రకటనను మీరు కూడా చూసేయండి.

<iframe width="600" height="450" src="//www.youtube.com/embed/agXy2W77vOU?rel=0&showinfo=0&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

ఇక మారుతి ఆల్టో కె10 ఫేస్‌లిఫ్ట్ విషయానికి వస్తే.. గత కొన్నేళ్లుగా కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న ఆల్టో మోడల్‌లో కంప్లీట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను గడచిన రెండేళ్ల క్రితం కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే, ఇది 800సీసీ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో 1000సీ వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ఆల్టో కె10 మోడల్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఆప్షన్‌తో కూడా లభ్యమవుతుంది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.3.06 లక్షలు (ఎక్స్-షోరూమ్). మరి ఈ యూత్‌ఫుల్ కారు కోసం కంపెనీ విడుదల చేసిన టెలివిజన్ కమర్షియల్‌ను మీరు కూడా చూసేయండి.

<iframe width="600" height="450" src="//www.youtube.com/embed/hIdSZEWhaNI?rel=0&showinfo=0&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

Most Read Articles

English summary
Maruti Suzuki India has revealed two new TVCs, showcasing their new cars - Alto K10 facelift with AMT and the new Swift facelift. Take a look.&#13;
Story first published: Thursday, November 13, 2014, 9:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X