భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్‌కి గడ్డుకాలం!

By Ravi

భారత మార్కెట్లో విక్రయిస్తున్న కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ ఫోక్స్‌వ్యాగన్. జర్మనీకి చెందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ భారత మార్కెట్లో తయారు చేస్తున్న ఉత్పత్తులో వినియోగించే కొన్ని రకాల విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఉద్దేశ్యంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: 110 సార్లు డ్రైవింగ్ టెస్టులో ఫెయిల్ అయిన లేడీ!

అయితే, ఇలా విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వలన ఉత్పాదక వ్యయం పెరగటం ఫలితంగా కంపెనీ ఉత్పత్తుల ధరలు అందుబాటులో లేకపోవటం జరుగుతోంది. ఇదే ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ ఇండియాకు మెయిన్ డ్రాబ్యాక్‌గా మారింది. దాదాపు ఐదేళ్లుగా భారత మార్కెట్లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్, ఇక్కడి మార్కెట్లో ఆశించిన వృద్ధిని సాధించలేకపోతోంది.

Volkswagen Struggling In India

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ఇండియాకు కేవలం 2.1 శాతం మార్కెట్ వాటా మాత్రమే ఉంది. అధిక ధర కారణంగానే భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు జోరుగా సాగటం లేదు. ఈ నేపథ్యంలో, ఫోక్స్‌వ్యాగన్ కార్ల ధరలను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఇప్పుడు తమ విడిభాగాలను ఇండియాలోనే తయారు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: బోష్ మై డ్రైవ్ అసిస్ట్ అప్లికేషన్

ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం దాదాపు 70 విడిభాగాలను స్థానికంగా కొనుగోలు చేస్తోంది. అయితే, రానున్న రోజుల్లో ఈ లోకలేజైషన్ పరిమితిని 90 శాతానికి పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గేర్‌బాక్స్‌లు, ఇంజన్లను ఇండియాలోనే ఉత్పత్తి చేయగలిగితే ఇది సాధ్యమవుతుంది. మరోవైపు బడ్జెట్ కార్ మార్కెట్లో కూడా ప్రవేశించి, తక్కువ ధరకే కార్లను విక్రయించేందుకు గాను ఫోక్స్‌వ్యాగన్ ఓ బడ్జెట్ కార్ బ్రాండ్‌ను ఇండియాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ వీడియో చూశారా..? ఈతకెళ్లిన బుగాటి వేరాన్ కారు
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/4NJmB1F2mdE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Volkswagen is the only automobile manufacturer in India to offer its vehicles with airbags as standard. They still import some of the components for its vehicles to ensure quality and reliability. However, this has not been the most economical way forward for the manufacturer.&#13;
Story first published: Monday, July 21, 2014, 10:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X