వోల్వో 360 డిగ్రీ ప్రమాద నివారణ సెన్సార్ సిస్టమ్

By Ravi

అత్యంత సురక్షితమైన మరియు అధునాతనమైన సేఫ్టీ ఫీచర్లను తయారు చేయటంలో ప్రపంచపు అగ్రగామి అయిన వోల్వో, తాజాగా మరో సరికొత్త సేఫ్టీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ పేరు 'వోల్వో 360 డిగ్రీ కొల్లైజన్ అవైడెన్స్ సెన్సార్ సిస్టమ్'.

దీని గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఈ టెక్నాలజీ సాయంతో కారు చుట్ట ప్రక్కల పొంచి ఉన్న ప్రమాదాలను సెన్సార్లు ముందుగానే పసిగిట్టి, డ్రైవరును/కారును అప్రమత్తం చేస్తాయి. వోల్వో 2020 నాటికి ప్రమాదరహిత వాహనాలను తయారు చేయాలనే తమ లక్ష్యంలో భాగంగా, ఈ లేటెస్ట్ సేఫ్టీ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

Volvo Develops 360 Degree Collision Avoidance Sensor System

వోల్వో నాన్-హిట్ కార్ అండ్ ట్రక్ ప్రాజెక్టులో భాగంగా కంపెనీలు తయారు చేసిన చివరి సేఫ్టీ ఫీచర్ ఇది. ఇందులోని 360 డిగ్రీ వ్యూ టెక్నాలజీ, ప్రమాదాలు జరగని ఎస్కేప్ రూట్స్‌ను లొకేట్ చేయటంలో సహకరిస్తుంది. డ్రైవర్లు పసిగట్టలేని అనేక ప్రమాదాలను కూడా ఈ సెన్సార్లు గుర్తించి, డ్రైవరును అప్రమత్తం చేస్తాయి.

అదే డ్రైవర్-రహిత (సెల్ఫ్ డ్రైవింగ్ లేదా అటానమస్) కార్లలో అయితే, ఈ సెన్సార్లు కారు చుట్టు ప్రక్కల ఉన్న ప్రమాదాలను గుర్తించి, దానికి అనుగుణంగా కారును నియంత్రిస్తాయి. వివిధ రకాల యాక్సిడెంట్లను నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే ఈ లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేశామని నాన్ హిట్ కార్ అండ్ ట్రక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆండెర్స్ ఆల్మెవడ్ తెలిపారు. ఈ టెక్నాలజీ గురించి వివరించే వీడియోని మీరు కూడా వీక్షించండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/mQQYF4hY4KU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Volvo has developed a 360-degree collision avoidance sensor system for its vehicles, and gets closer to its goal of zero fatalities in company cars by 2020.&#13;
Story first published: Tuesday, October 14, 2014, 12:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X