డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వోల్వో బస్సు; 8 మంది సజీవదహనం

By Ravi

దేశంలో వోల్వో బస్సు ప్రమాదాల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఇటీవల జరిగిన పాలెం, కర్ణాటక వోల్వో బస్సు ప్రమాదాలు మర్చిపోక ముందే ముంబైకి సమీపంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు జామున ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఓ వోల్వో బస్సు, డీజిల్ ట్యాంకర్ డీ కొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందగా, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

పూణే నుంచి అహ్మదాబాద్‌‌కు బయలు దేరిన వోల్వో బస్సు ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి గల మనోర్ ప్రాంతానికి చేరగానే డీజిల్ ట్యాంకర్‌‌ను డీ కొట్టింది. దీంతో వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. రాత్రి సమయం కావటంతో ప్రయాణికులంతా ఘాడ నిద్రలో ఉన్నారు. బస్సులో చెలరేగిన మంటల్లో 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

హైవే పై వెళ్తున్న ఇతరుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు మరియు అత్యవసర విభాగాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: వోల్వో బస్సుల్లో ప్రయాణం - సేఫ్టీ టిప్స్

Most Read Articles

English summary
As many as 8 passengers have been charred to death in a tragic accident involving a Volvo bus and a diesel tanker in the outskirts of Mumbai. The Volvo bus, which was on way to Ahmedabad from Pune, hit a diesel tanker near Kude village in Manor, Maharashtra between 1 and 2 a.m. on Wednesday.
Story first published: Wednesday, January 29, 2014, 12:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X