ఐషర్ స్కైలైన్ ప్రో సిరీస్ లైట్ డ్యూటీ బస్సుల విడుదల

Written By:

ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ (విఈసివి) బెంగుళూరు మార్కెట్లో తమ కొత్త తరం ఐషర్ స్కైలైన్ ప్రో సిరీస్ లైట్ డ్యూటీ బస్సులను విడుదల చేసింది. ప్రయాణీకుల భద్రత, సౌకర్యం, మంచి డ్రైవబిలిటీ, నాణ్యమైన నిర్మాణం, ఉత్తతమ మైలేజ్, పర్యావరణ సాన్నిహిత్యంగా ఉండే బస్సులను కోరుకునే ప్రీమియం మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఈ అధునాతన బస్సులను తయారు చేశామని కంపెనీ పేర్కొంది.

విఈసివి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్, ఆఫ్టర్ మార్కెట్) శ్యామ్ మల్లర్ మాట్లాడుతూ.. భారతదేశంలో రవాణా సామర్థ్యాన్ని నిరంతరాయంగా మెరుగుపరచే తమ సిద్ధాంతం ప్రకారం, ఈ నెక్స్ట్ జనరేషన్ ఐషర్ స్కైలైన్ ప్రో సిరీస్ బస్సులను అభివృద్ధి చేశామని, వీటి ద్వారా ప్రజా రవాణా ఖర్చును తగ్గించడం మరియు ఉత్పాదకతను పెంచడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

ఐషర్ స్కైలైన్ ప్రో సిరీస్ బస్సులు పాఠశాలలు, ఉద్యోగులు మరియు పర్యాటకుల కోసం తయారు చేయబడినవి. ఇవి 36-60 సీటింగ్ కెపాసిటీతో లభ్యం కానున్నాయి. ఈ బస్సులలో ఐషర్ ఈ-483 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ తక్కువ మెయింటినెన్స్‌కి, మంచి మైలేజీకి పెట్టింది పేరు. అధిక పొడవు, వెడల్పు ఉండే ఈ బస్సు లోపల విశాలమైన స్థలం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
VECV’s much awaited new generation Eicher Skyline Pro Series of light duty buses has been launched in Bangalore.
Please Wait while comments are loading...

Latest Photos