కారులో సీట్ బెల్టుల ప్రాముఖ్యత ఏమిటి?

నందమూరి హరిక్రిష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసినదే. రాంగ్ రూట్‌లో ఎదురుగా ఓ ట్రాక్టర్ రావటం, ఆ టాక్టర్‌కు హెడ్‌‌లైట్స్ లేకపోవడం, కారు మితిమీరన వేగంతో నడపటం, సీట్ బెల్ట్ ధరించకపోవటం, ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కాకపోవటం వంటి అనేక అంశాలు జానకీరామ్ మృతికి కారణమయ్యాయి.

ఇప్పటికే చాలా మంది ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. సేఫ్టీ విషయంలో వహించే చిన్నపాటి నిర్లక్ష్యం వల్లనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జానకీరామ్ మరణం విషయంలో కూడా ఇదే జరిగింది. కారు నడుపుతున్నప్పుడు ఆయన సీట్ బెల్ట్ ధరించని కారణంగానే ఈ ప్రమాదం మృతి చెందారని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అసలు సీట్ బెల్ట్ ప్రాముఖ్యత ఏంటి, ధరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.


అసలు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి..?
కారును 2 కిలోమీటర్ల దూరం నడిపినా లేదా 200 మైళ్ల దూరం నడిపినా సరే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. సీట్ బెల్టులు అన్ని సంధర్భాల్లో దానిని ధరించిన వారి ప్రాణాలను రక్షిస్తాయని చెప్పలేం, కానీ ఏ కాస్త అవకాశం దొరికినా వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది.

చలనంలో ఉన్న కారులో మనం కూర్చున్నామంటే, కారుతో పాటుగా మనం కూడా వేగంగా వెళ్తున్నట్టే లెక్క. అలాంటప్పుడు, దురదృష్టవశాత్తు ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొనడం వల్లనో లేదా ఏ డివైడర్‌నో, కరెంటు స్తంభాన్నో లేదా చెట్టునో ఢీకొనడం వల్ల కారు ఉన్నట్టుండి ఆగిపోతుంది. కానీ కారుతో పాటుగా చలనంలో ఉన్న మన శరీరం మాత్రం ఆ వేగాన్ని నియంత్రించుకోలేదు.

ఎదురుగా వచ్చే/ఉన్న అడ్డంకిని తగిలి కారు ఆగినంత వేగంగా మన శరీరం ఆగలేదు కాబట్టి, అప్పటిదాకా ఆ కారు ప్రయాణిస్తున్న వేగంతోనే మన శరీరం కూడా ముందుకు తూలుతుంది. ఆ సమయంలో కారు ముందు సీటులో కూర్చున్న వారి ఛాతీ డాష్‌బోర్డునో లేక స్టీరింగ్ వీల్‌‌నో (డ్రైవర్) బలంగా ఢీకొంటుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే, ఛాతీ ఎముకలు విరగడం, విరిగిన ఎముకలు ఛాతీలోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తులను, గుండెను ఛిద్రం చేయడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.

Airbag

సీట్ బెల్టుకి ఎయిర్‌బ్యాగ్స్‌కి మధ్య సంబంధం ఏమిటి?
సీట్ బెల్టుకి మరియు ఎయిర్‌బ్యాగ్‌కి మధ్య అవినాభావం సంబంధం ఉంది. కొన్ని సందర్భాల్లో సీట్ బెల్టు ధరిస్తేనే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ప్రత్యేకించి ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ విషయంలో ఇది తప్పనిసరి.

ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్ అంటే ఏమిటి, అవెలా పనిచేస్తాయి?
ఎయిర్‌బ్యాగ్స్‌లో ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్ మరింత మోడ్రన్ టెక్నాలజీతో తయారు చేయబడినది (ప్రస్తుతం దాదాపు అన్ని కార్లలో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు). సప్లిమెంటల్ రెస్ట్రైంట్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవటం అనేది సీట్ బెల్ట్‌తో లింక్ అయి ఉంటుంది. ప్రమాద సమయంలో ఇది విచ్చుకున్నప్పుడు సీట్ బెల్టులు ఆటోమేటిక్‌గా టైట్ అవుతాయి. ఆ తర్వాత ఇది విచ్చుకుంటుంది.

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న అనేక మంది సీట్ బెల్ట్ ధరించకపోవటం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇకనైనా మేల్కొని, కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏ సీట్లో కూర్చున్నా సరే సీట్ బెల్ట్ ధరించడం మర్చిపోకండి..!

Most Read Articles

English summary
Nandamuri Hari Krishna's elder son and actor Kalyan Ram's elder brother Nandamuri Janaki Ram has passed away in a tragic road accident. The accident took place on Saturday when Janaki Ram was on his way to Vijayawada from Hyderabad. According to reports, Janaki Ram was driving the car. Janaki Ram was said to be alone in the car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X