మీ కారు కోసం 5 ఏళ్ల వాహన బీమా కొనుగోలు చేస్తారా?

By Ravi

కార్ ఇన్సూరెన్స్ (వాహన బీమా) పాలసీల విషయంలో కూడా ఇకపై లాంగ్ టెర్మ్ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి సంవత్సరం కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసుకునే రిస్క్ లేకుండా ఏకంగా ఐదేళ్లకు ఒకేసారి పాలసీని తీసుకునే వెసులుబాటును కల్పించాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఏ యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు చిట్కాలు

వన్ టైమ్ విధానంగా ఐదేళ్ల పాటు కారుకు బీమా కవరేజ్ కల్పించేలా పాలసీలను ఆఫర్ చేయాలనే ప్రతిపాదనను బీమా నియంత్రణ సంస్థ పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఈమేరకు ఇలాంటి లాంగ్ టెర్మ్ ఉత్పత్తుల విషయంలో ఐఆర్‌డిఏ తాజా మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇలా ఐదేళ్లకు ఒక్కసారి పాలసీ తీసుకోవటం వలన ప్రీమియం కూడా తగ్గుతుంది.

Car Insurance

ప్రతిఏటా వాహన బీమా రెన్యువల్ అనేది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కొందరు వాహన యజమానులు తమ వాహన బీమా పాలసీ గడువు ముగిసిపోయినప్పటికీ దానిని రెన్యువల్ చేయించరు. ఇందుకు అనేక కారణాలుంటాయి. ఉదారహణకు బీమా పాలసీ గడువు ముగిసిపోయిన సంగతిని సదరు వాహన యజమానులు మర్చిపోవచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లోని వాహనాల విషయంలో బీమా రెన్యువల్ గురించి వాహన చాలకులు పట్టించుకోకపోవచ్చు లేదా ఈ బీమా పట్ల కొందరిలో అవగాహన ఉండకపోవచ్చు.

ఇది కూడా చదవండి: మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి తప్పనిసరిగా ఉండాల్సిన యాడ్-ఆన్స్

చాలా కంపెనీలు కూడా ఇదే విషయాన్ని ఐఆర్‌డిఏ దృష్టికి తీసుకువెళ్లాయి. వాహన బీమా రెన్యువల్స్ సక్రమంగా జరగటం లేదని, ఆదిలోనే లాంగ్ టర్మ్ పాలసీలను తీసుకున్నట్లయితే, అది ఇన్సూరెన్స్ కల్చర్‌ను కూడా ప్రమోట్ చేసినట్లు అవుతుందని ఐఆర్‌డిఏ అధికారి ఒకరు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ, ఈ తరహా లాంగ్ టర్మ్ వాహన బీమా పాలసీలు పూర్తిగా అందుబాటులోకి వస్తే, ఇవి సరమైన ధరకే లభించడంతో పాటుగా, ప్రతి ఏటా వాహన బీమా కోసం డబ్బులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మీరేమంటారు..?

ఈ వీడియో చూశారా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/4NJmB1F2mdE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
According to ET report, Insurance Regulatory and Development Authority (IRDA) is considering a proposal to allow insurers to offer policies with a one-time, five-year cover and is expected to issue fresh guidelines on such long-term products.&#13;
Story first published: Wednesday, July 23, 2014, 10:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X