టొయోటా బిడది ప్లాంట్‌లో కార్మిక సమస్య సమసినట్లే!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటాకు చెందిన బెంగుళూరు బిడది ప్లాంట్‌లలో కార్మికులు గత కొంత కాలంగా మౌనపోరాటం చేస్తూ, ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసినదే. టొయోటా యాజమాన్యానికి మరియు మరియు యూనియన్ వర్కర్లకు పలుమార్లు జరిగిన చర్చలు విఫలం కావటంతో, ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది.

వేతనాల సవరణ విషయంలో కార్మికులు సమ్మెకు దిగి, ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ప్లాంట్‌లలో తక్షణమే ఉత్పత్తిని యధావిధిగా కొనసాగించాలని యాజమాన్యాన్ని మరియు వర్కర్స్ యూనియన్‌ను ఆదేశించింది.

Toyota

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్‌కు బిడదిలో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో కలిపి సాలీనా 3,10,000 వాహనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్లాంట్లలో 6,400 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. అయితే, గడచిన 2 నెలలుగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, ఒక వర్గం కార్మికులు కావాలనే ఉత్పత్తికి విఘాతం కలి గిస్తున్నారని టికెమ్ చెబుతోంది.
Most Read Articles

English summary
The Karnataka Government has ordered the Toyota Kirloskar management and the striking Union members to end the deadlock and restore normalcy from today. The order to restore normalcy was given on Saturday after a meeting between the three bodies.
Story first published: Tuesday, April 22, 2014, 10:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X