భారత్‌లో యమహా మోటార్ గ్రూప్ కంపెనీలకు కొత్త చైర్మన్

By Ravi

భారతదేశంలో యమహా మోటార్ గ్రూప్ కంపెనీలకు కొత్త చైర్మన్‌ను నియమిస్తున్నట్లు జపాన్‌కి చెందిన యమహా మోటార్ కార్పోరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ గ్రూపుకు హిరోకి ఫుజిటా కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

భారత్‌లోని యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్, యమహా మోటార్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు కొత్త చైర్మన్‌గా హిరోకి ఫుజిటా నియామకం జనవరి 1, 2015 నుంచి అమల్లోకి రానుంది.

Hiroaki Fujita

ప్రస్తుతం భారత్‌లో యమహా గ్రూప్ కంపెనీలకు హిరోయికి సుజుకి చైర్మన్‌గా బాధ్యతలు వహిస్తున్నారు. కాగా.. జనవరి నుంచి హిరోకి ఫుజిటా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. అంతేకాకుండా.. యమహా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా ఆయన ప్రెసిడెంట్, సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

హిరోకి ఫుజిటా గడచిన 32 ఏళ్లకు పైగా యమహా కంపెనీలో పనిచేస్తున్నారు. చైర్మన్ పదవికి ముందు ఆయన ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్, ఇంటెలిజెంట్ మెషీనరీ (ఐఎమ్) ఆపరేషన్స్ పదవులలో విధులు నిర్వర్తించారు. అలాగే, 2011 వరకూ వైఎమ్‌సిలో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా కొనసాగారు.

Most Read Articles

English summary
Yamaha Motor Co., Ltd., Japan (YMC) today announced the appointment of Mr. Hiroaki Fujita as the new Chairman of Yamaha Motor Group companies in India including India Yamaha Motor Pvt. Ltd. (IYM), Yamaha Motor India Sales Pvt. Ltd. (YMIS) and Yamaha Motor Research & Development India Pvt. Ltd. (YMRI) with effect from the 1st of January, 2015.
Story first published: Friday, December 26, 2014, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X