2015 డెట్రాయిట్ ఆటో షో: ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ ఆవిష్కరణ

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, డెట్రాయిట్‌లో జరుగుతున్న 2015 నార్త్ అమెరికా ఇంటర్నేషనల్ ఆటో షోలో ఓ సరికొత్త కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. 'ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ' (Volkswagen Cross Coupe GTE) పేరుతో కంపెనీ ఆవిష్కరించిన ఈ మోడల్ ఓ 5-సీటర్ క్రాసోవర్. అంతేకాదు, ఇదొక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కూడాను.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ కారులోని పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి గరిష్టంగా 355 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అమెరికా మార్కెట్ కోసం ఫోక్స్‌వ్యాగన్ అభివృద్ధి సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌కి అంబాసిడరే ఈ క్రాస్ కూపే జిటిఈ అని కంపెనీ ఛీఫ్ డిజైనర్ క్లాస్ బిషఫ్ తెలిపారు. ఇది కేవలం కాన్సెప్ట్‌కి మాత్రమే పరిమితం కాకుండా ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం కూడా ఉంది. కూపే మరియు ఎస్‌యూవీలను కలగలపి ఈ మోడల్‌ను డిజైన్ చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ పేరులో 'జిటి' అంటే గ్రాన్ తురిస్మో అని, 'ఈ' అంటే ఎలక్ట్రిక్ అని అర్థం.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

పూర్తి బ్యాటరీ పవర్‌పై ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ 20 మైళ్లు దూరం ప్రయాణిస్తుంది, అంతేకాకుండా ఇది కేవలం 6.0 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ కారులో విభిన్న ఆపరేటింగ్ మోడ్స్ ఉంటాయి. అవి ఈ-మోడ్, జిటిఈ, హైబ్రిడ్, ఆఫ్-రోడ్, బ్యాటరీ హోల్డ్/బ్యాటరీ చార్జ్.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

ఫోక్స్‌వ్యాగన్ ప్రదర్శించిన క్రాస్ కూపే జిటిఈ మూడవ కాన్సెప్ట్ కార్ (గతంలో క్రాస్‌బ్లూ, క్రాస్‌బ్లూ కూపే కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది) , ఇది ప్రొడక్షన్‌కు చాలా దగ్గరగా ఉన్న మోడల్. ఈ కాన్సెప్ట్ ఆధారంగా కంపెనీ ఓ ప్రొడక్షన్ వెర్షన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్లాన్ చేసే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ కాన్సెప్ట్ కారును గ్రాండ్ పసిఫిక్ గ్లాసీయర్ బ్లూ కలర్‌లో పెయింట్ చేశారు. ఇది 190.8 ఇంచ్‌ల పొడవును, 79.9 ఇంచ్‌ల వెడల్పును, 68.3 ఇంచ్‌ల ఎత్తును కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ కాన్సెప్ట్ ఇంటీరియర్స్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. అధునాత సాంకేతికతకలన్నీ ఈ కారులో లభ్యం కానున్నాయి. ఇంటీరియర్ లుక్‌ని ఈ ఫొటోలో చూడొచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

క్రాస్ కూపే జిటిఈ కాన్సెప్ట్‌ను ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యంత పాపులర్ అయిన మాడ్యులర్ ట్రాన్స్‌వెర్స్ మ్యాట్రిక్స్ (ఎమ్‌క్యూబి) ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది కేవలం పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోనే కాకుండా ప్లగ్ఃఇన్ హైబ్పిడ్, న్యూచురల్ గ్యాస్, ఫుల్ ఎలక్ట్రిక్ మరియు ఫ్యూయెల్ సెల్ ఇంధన ఆప్షన్‌లను కూడా ఇందులో ఆఫర్ చేయవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

కాగా.. డెట్రాయిట్‌లో ఫోక్స్‌వ్యాగన్ ప్రదర్శనకు ఉంచిన క్రాస్ కూపే జిటిఈ కాన్సెప్ట్‌లో 3.6 లీటర్, 6-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్, విఆర్6, పెట్రోల్ ఇంజన్‌ను మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించారు.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 276 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ముందు వైపు ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను, వెనుక వైపు మరో ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఫ్రంట్ ఎలక్ట్రిక్ మోటార్ 54 హెచ్‌పిల శక్తిని, రియర్ ఎలక్ట్రిక్ మోటార్ 114 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ కూపే జిటిఈ

ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కారులో ఉండే 14.1 కిలో వాట్ లిథియ్ అయాన్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. మొత్తంగా మూడు ఇంజన్లు కలిసి 355 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీని గరిష్ట వేగం గంటకు 130 మైళ్లు.


Most Read Articles

English summary
At the end of 2016, Volkswagen will start production of one of its most important new models in the past five decades in Chattanooga, Tennessee: a seven-seater mid-size SUV. As a preview to this vehicle, Volkswagen is now showing the five-seater Cross Coupe GTE at the North American International Auto Show in Detroit.
Story first published: Thursday, January 15, 2015, 10:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X