2015 స్కొడా ఫ్యాబియా ఇంటీరియర్స్ ఫొటోలు వెల్లడి

By Ravi

మార్కెట్ నుంచి పూర్తిగా తొలగిపోయిందనుకున్ స్కొడా ఫ్యాబియా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సరికొత్త రూపంతో తిరిగి మన ముందుకు రాబోతోంది. చెక్ రిపబ్లికన్ కార్ కంపెనీ స్కొడా తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫ్యాబియాలో నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి అఫీషియల్ ఎక్స్టీరియర్ ఫొటోలను విడుదల చేసిన స్కొడా, తాజాగా ఇంటీరియర్ ఫొటోలను కూడా విడుదల చేసింది.

పూర్తిగా రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రీడిజైన్డ్ స్టయిలిష్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై వివిధ కంట్రోల్స్, డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఏసి వెంట్స్ వంటి మార్పులను ఈ ఫొటోలో చూడొచ్చు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగనున్న 2014 ప్యారిస్ మోటార్ షోలో స్కొడా తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్యాబియాహ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించనుంది.


సరికొత్త 2015 స్కొడా ఫ్యాబియాలో కాస్మోటిక్ మార్పులతో పాటుగా ఇంజన్ పరంగా మార్పులు కూడా ఉంటాయి. పెట్రోల్ వెర్షన్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్ ఇంజన్ మరియు 1.2 లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ 1.4 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇందులో ఓ గ్రీన్‌లైన్ డీజిల్ ఇంజన్‌ను కూడా 2015లో పరిచయం చేయనున్నారు. ఈ ఇంజన్లనీ కూడా ఈయూ6 కాలుష్య నిబంధనలను పాటిస్తాయి.

ఈ ఇంజన్లన్నీ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్‌లను కస్టమర్ల కోరిక మేరకు ట్యూన్ చేసి ఇస్తారు. ఉదాహరణకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను 60 బిహెచ్‌పిల నుంచి 110 బిహెచ్‌పిల వరకు, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను 75 బిహెచ్‌పిల నుంచి 105 బిహెచ్‌పిల వరకు ట్యూన్ చేసిస్తారు. వచ్చే ఏడాదిలో ఈ కొత్త స్కొడా ఫ్యాబియా ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది.

2015 Fabia

ఇండియన్ మార్కెట్‌కు రానున్న నెక్స్ట్ జనరేషన్ స్కొడా ఫ్యాబియాలో 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. స్కొడా ఇండియా తొలిసారిగా 2008లో ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నిర్మాణ నాణ్యత, సౌకర్యం, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో ఫ్యాబియా మంచి ప్రీమయం కార్‌గా నిలిచింది.
Most Read Articles

English summary
Skoda has been teasing the world with its new 2015 Fabia hatchback. They had begun by revealing the sketch of their redesigned Fabia. They followed it by showing the exteriors of the vehicles. However, we now have for you the interior of their 2015 hatchback.
Story first published: Wednesday, August 27, 2014, 14:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X