వేలంలో రూ.60 కోట్ల వెల పలికిన 1964 ఫెరారీ 250 ఎల్ఎమ్

By Ravi

సాధారణంగా వేలంలో అరుదైన పురాతన కార్లు అత్యధిక వెల పలుకుతాయి. అందులోను ఫెరారీ వంటి కార్లయితే, ఇక వాటి వెల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న అరుదైన పురాతన ఫెరారీ రేస్ కార్ వేలంలో ఏకంగా రూ.60 కోట్ల వెల పలికింది.

ఆరిజోనాలోని ఆర్ఎమ్ ఆక్షన్స్ ఇటీవల నిర్వహించిన ఓ వేలంలో 1964 ఫెరారీ 250 ఎల్ఎమ్ 9.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అరిజోనా సేల్‌లోనే ఇది ఓ సరికొత్త రికార్డ్. ఓ ఫెరారీ కలెక్టర్ ఈ కారును వేలంలో సొంతం చేసుకున్నారు.

ఆర్ఎమ్ ఆక్షన్స్ నిర్వహించిన వేలంలో మరికొన్ని ఫెరారీ కార్లు కూడా అత్యధిక ధరను పలికాయి. వీటిలో రీస్టోర్ చేయబడిన 1966 ఫెరారీ 275 జిటిఎస్ వెల 2.36 మిలియన్ డాలర్ల (సుమారు రూ.15 కోట్లు) వెల పలుకగా, 1984 ఫెరారీ 288 జిటిఓ 2.75 మిలియన్ డాలర్ల (సుమారు రూ.17 కోట్ల) వెల పలికింది.

ఆరిజోనాలో ఆర్ఎమ్ ఆక్షన్స్ మొత్తం 17 కార్లను వేలం వేస్తే, అందులో అత్యధిక వెల పలికింది మాత్రం ఈ 1964 ఫెరారీ 250 ఎల్ఎమ్ కారే. ఫెరారీ అప్పట్లో ఇలాంటి కార్లు కేవలం 32 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుంది. అందులో ఇది తొమ్మిదవది.

1964 Ferrari 250 LM
Most Read Articles

English summary
A very special 1964 Ferrari 250 LM that sold for USD 9.6 million (around INR 59 crore), a new record for an Arizona sale. Other exclusive Ferrari machinery too racked up the greenbacks. 
Story first published: Friday, January 23, 2015, 9:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X