సౌత్ ఆఫ్రికాకు మేడ్ ఇన్ ఇండియా హోండా జాజ్

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే భారత్‌లో తమ 2015 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ మేడ్ ఇన్ ఇండియా హోండా జాజ్ కారును భారత్ కన్నా ముందుగా దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల కానుంది. ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తి అయిన జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ దక్షిణాఫ్రికా మార్కెట్‌కు ఎగుమతి చేస్తోంది.

గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌‌పోలో హోండా తొలిసారిగా తమ జాజ్ ప్రీమియం హ్యాచ్‌‌బ్యాక్‌ను ప్రజలకు పరిచయం చేసింది. బెస్ట్ ఇన్ క్లాస్ ప్రీమియం ఫీచర్లతో ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టంగా ఉండేలా హోండా తమ మోడ్రన్ జాజ్ కారును తయారు చేశారు. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో పోటీ పడనుంది.

honda jazz india

జాజ్ బేసిక్ డిజైన్‌ను అలానే ఉంచుతూ, ఇదివరకటి తరం జాజ్ కన్నా మరింత షార్పర్‌గా, అగ్రెసివ్ లుక్‌ని కలిగి ఉండేలా కొత్త జాజ్‌ను డిజైన్ చేశారు. గ్లోబల్ వెర్షన్ హోండా జాజ్ ప్రీమియం బ్యాచ్‌బ్యాక్ కారులో ఏబిఎస్, ఈబిడి, జి-కాన్ (జి ఫోర్స్ కంట్రోల్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో 7-ఇంచ్ టిఎఫ్‌టి ఆడియో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

కొత్త 2015 హోండా జాజ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 117 హెచ్‌పిల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమేజ్, సిటీ, మొబిలియో మోడళ్లలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Honda Cars India has planned to locally manufacture the Jazz to keep costs low. Now the Japanese manufacturer has already commenced assembly of its Jazz in India. They have, however, still not launched the hatchback in India and have begun exports to South-Africa.
Story first published: Thursday, January 29, 2015, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X