షెవర్లే బీట్ టీజర్ ఫొటో; త్వరలో న్యూయార్క్‌లో విడుదల

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ అందిస్తున్న చిన్న 'షెవర్లే స్పార్క్' (భారత మార్కెట్లో షెవర్లే బీట్)లో కంపెనీ సరికొత్త మోడల్‌ను మరికొద్ది రోజుల్లోనే ప్రపంచానికి పరిచయం చేయనుంది. షెవర్లే స్పార్క్/బీట్ కంప్లీట్ ఫేస్‍‌లిఫ్ట్ మోడల్‌ను 2015 న్యూయార్క్ ఆటో షోలో ఆవిష్కరించనుంది.

ఏప్రిల్ 2, 2015వ తేదీ నుంచి న్యూయార్క్ ఆటో షో ప్రారంభం కానుంది. ఈ కొత్త స్పార్క్ (బీట్) డిజైన్ సెగ్మెంట్‌తో పాటుగా వృద్ధి చెందుతూ వచ్చిందని, ఇది మరింత యూత్‌‌ఫుల్ లుక్‌ని కలిగి ఉండి, కస్టమర్లను ఆకట్టుకుంటుందని జనరల్ మోటార్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ (డిజైన్ విభాగం) మైఖేల్ సిమ్కోస్ తెలిపారు.

chevrolet beat debut launching soon

నెక్స్ట్ జనరేషన్ షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్ ఏరోడైనమిక్స్‌ని మెరుగు పరచడంలో జనరల్ మోటార్స్ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. యువతను ఆకర్షించేలా జనరల్ మోటార్స్ తమ సరికొత్త 2016 బీట్‌ను డిజైన్ చేసింది. కాకపోతే, కొత్త బీట్‌లో యాంత్రికపరంగా పెద్దగా మార్పలు ఉండబోవని సమాచారం.

ప్రస్తుత తరం షెవర్లే బీట్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ కొత్త తరం బీట్‌లోను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఇది పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకూ 1.1 మిలియన్ యూనిట్లకు పైగా బీట్/స్పార్క్ కార్లు అమ్ముడుపోయాయి. కొరియా, మెక్సికో, అమెరికా దేశాల్లో ఈ కారుకు మంచి గిరాకీ ఉంది.

Most Read Articles

English summary
Chevrolet is one of the brands of four-wheelers owned by General Motors. They offer their products all over the world. Chevrolet will be introducing its all-new Spark/Beat hatchback depending, where you are from.
Story first published: Tuesday, March 10, 2015, 16:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X