3 ఏళ్లకు ఒకసారి వాహన బీమా; ఐఆర్‌డిఏ ఆమోదం

By Ravi

టూవీలర్ ఇన్సూరెన్స్‌ను ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, మూడేళ్ల ఒకసారి చొప్పున బీమాను అందించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ గడచిన సంవత్సరం ఓ ప్రతిపాదనను తీసుకువచ్చిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఆ ప్రతిపాదనకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఏ ఆమోదం తెలిపింది.

ఈ సరికొత్త దీర్ఘకాలిక సమగ్ర బీమా పథకం (లాంగ్‌టెర్మ్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్)ను ప్రవేశపెట్టడానికి ఇటీవలే 'న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ'కి ఐఆర్‌డిఏ అనుమతినిచ్చింది.

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టూవీలర్ కోసం ఒకేసారి మూడేళ్ల పాటు పాలసీని కొనుగోలు చేస్తే పాలసీ మొత్తంలో 30 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది.
మరి మీరు కూడా మీ టూవీలర్ కోసం మూడేళ్లకు ఒకసారి చొప్పున పాలసీని కొనుగోలు చేస్తారా..?

ఈ కొత్త రకం పాలసీపై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ఈ స్కీమ్‌లో వినియోగదారునికి నో క్లెయిమ్ బోనస్, అండర్ రైటింగ్ ప్రయోజనాలు ఉంటాయని, దీనికి అదనంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుందని చెప్పారు.

అతిత్వరలో ఈ పాలసీని ప్రారంభించే అవకాశముంది. ఇందులో మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే పాలసీ అమలులో ఉన్న కాలంలో బీమా కంపెనీ ప్రీమియం ధరలను సవరించటం చేయదు. ఒకవేళ క్లెయిమ్ చేసినా కూడా అదే ప్రీమియమే కొనసాగుతుంది.
మీరు కూడా ఈ పాలసీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా..?

Most Read Articles

English summary
Two-wheeler owners can soon buy a motor insurance policy for a period of three years. The New India Assurance Co has got approval from the Insurance Regulatory and Development Authority (Irda) for launching a comprehensive long-term policy. 
Story first published: Tuesday, March 17, 2015, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X