2017లో కస్టమర్ల చెంతకు రానున్న ఏరోమొబిల్ ఫ్లయింగ్ కార్

By Ravi

స్లోవేకియాకు చెందిన ఇంజనీర్ స్టీఫెన్ క్లీన్ తయారు చేసిన ఏరోమొబిల్ ఫ్లయింగ్ కారు‌లో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్‌ను అక్టోబర్ 29, 2014వ తేదీన ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన పయోనీర్స్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

కాగా.. ఇప్పుడు ఈ ఫ్లయింగ్ కార్‌ని కమర్షియల్‌గా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని, సంబంధిత అనుమతులు కూడా పొందిన ఏరోమొబిల్ ఫ్లయింగ్ కారును 2017 ఆరంభంలో కస్టమర్లకు విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.

మరో రెండేళ్లలో ఈ ప్రోడక్ట్‌ని మార్కెట్లో విడుదల చేస్తామని ఏరోమొబిల్ సీఈఓ జురజ్ వక్యులిక్ తెలిపారు. ఏరోమొబిల్ సంస్థ 1990వ సంవత్సరం నుంచి ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్‌పై పనిచేస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2017లో ఫ్లయింగ్ కార్ సేల్స్

ప్రొడక్షన్ వెర్షన్ ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారులో రోటాక్స్ 912 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను ఏరోమొబిల్ 3.0 వెనుక భాగంలో అమర్చారు.

2017లో ఫ్లయింగ్ కార్ సేల్స్

ఏరోమొబిల్ 3.0 గాలిలో 700 కిలోమీటర్ల దూరం, నేలపై 875 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. గాలిలో ఇది గంటకు 15 లీటర్ల ఇంధనాన్ని, రోడ్డుపై 12.5 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

2017లో ఫ్లయింగ్ కార్ సేల్స్

గాలిలో ఏరోమొబిల్ 3.0 గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు, రోడ్డుపై గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. టేకాఫ్ స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు.

2017లో ఫ్లయింగ్ కార్ సేల్స్

ఏరోమొబిల్ 3.0 ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. నాలుగు చక్రాలు కలిగిన ఈ వాహనంలో వెనుక చక్రాలు బ్యాలెన్సింగ్ కోసం సహకరిస్తాయి, ముందు చక్రాలు ఇంజన్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.

2017లో ఫ్లయింగ్ కార్ సేల్స్

ఏరోమొబైల్ 3.0 క్యాబిన్/కాక్‌పిట్‌లో రెండు సీట్లు ఉంటాయి. ఇందులో ఒకటి డ్రైవర్/పైలట్ కోసం మరొకటి ప్యాసింజ్/కోపైలట్ కోసం.

2017లో ఫ్లయింగ్ కార్ సేల్స్

ఈ ఫ్లయింగ్ కారులో రెండు స్టీరింగ్ వీల్స్ ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఇందులో పెద్ద స్టీరింగ్‌ను రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఉపయోగించాలి, దానిపై ఉండే చిన్న స్టీరింగ్‌ను గాలిలో ఫ్లయింగ్ కారును కంట్రోల్ చేసేందుకు వినియోగించాలి.

2017లో ఫ్లయింగ్ కార్ సేల్స్

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారు ఫ్రేమ్‌ను స్టీల్‌తో తయారు చేశారు, దీని బాడీని కార్భన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు. ఫలితంగా దీని తక్కువ బరువును కలిగి ఉంటుంది.

వీడియో

ఏరోమొబిల్ 3.0 ఫ్లయింగ్ కారు టెస్ట్ ఫ్లయిట్ వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించవచ్చు.

Most Read Articles

English summary
Czech-built two-seater flying car Aeromobil, which can take flight from any clear road could go on sale as early as 2017, potentially changing personal transport on a global scale, its manufacturers say.
Story first published: Wednesday, March 18, 2015, 12:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X