జింబాంబ్వేకు వాహనాలు ఎగుమతి చేయనున్న అశోక్ లైలాండ్

By Vinay

అశోక్ లైలాండ్ తన వాహనాలు మరియు విడి భాగాలను జింబాంబ్వేకు ఎగుమతి చేస్తోంది. దీనికి 2015 జూన్ 28న ప్లాగ్‌ఆఫ్ చేసింది.

ఈ భారత తయారీ సంస్థ జింబాంబ్వే ప్రభుత్వం నుంచి ఒక కాంట్రాక్టును దక్కించుకుంది. అశోక్ లైలాండ్ తయారీ మరియు మెయింటెనెన్స్ మీద సాంకేతిక సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తోంది.

ఈ కాంట్రాక్టు కింద 633 మోడళ్లను జింబాంబ్వేకు అందజేస్తోంది. అశోక్ లైలాండ్ పంపిన ప్రతిపాదనలను టూరిజం మరియు వసతి కల్పన శాఖ అంగీకరించింది.

ashok

ఎక్సిమ్ బ్యాంక్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యదువేంద్ర మతూర్ జెండా ఊపి ఎగుమతిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ రస్క్వినా మరియు అశోక్ లైలాండ్ జనరల్ మేనేజర్ హర్స బంగారి ఉన్నారు.

ఈ అశోక్ లైలాండ్ ఎగుమతితో భారత్ మరియు జింబాంబ్వే మధ్య బంధం మరింత పెరగనుంది. మరిన్ని తయారీ సంస్థలు ఇలా ముందుకు నడిచే ఆలోచనలో ఉన్నాయి.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Most Read Articles

English summary
Ashok Leyland has commenced the export of their vehicles and spare parts to Zimbabwe. They organised a flag-off ceremony at Mumbai Port Trust on 28th of June, 2015.
Story first published: Friday, July 3, 2015, 9:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X