ఆడి మ్యాట్రిక్స్ ఎల్ఈడి లైట్లు ఎలా పనిచేస్తాయంటే..

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి, ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా లేజర్ హెడ్‌లైట్లతో కూడిన కార్లను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఈ టెక్నాలజీతో తయారు చేసిన ఆడి ఆర్8 ఎల్ఎమ్ఎక్స్ కారును కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. భవిష్యత్తులో ఆడి టిటి, ఆడి ఏ8 మోడళ్లతో పాటుగా పలు ఇతర మోడళ్లలో కూడా ఈ తరహా హెడ్‌లైట్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఆడి ఈ హెడ్‌లైట్ టెక్నాలజీని 'మ్యాట్రిక్స్ ఎల్ఈడి' (Matrix LED) అని పిలుస్తోంది. ఇది హెడ్‌లైట్స్ టెక్నాలజీలో కెల్లా అత్యంత అధునాతమైనది. మ్యాట్రిక్ ఎల్ఈడి సిస్టమ్ కలిగి ఆడి కార్లు తమకు ఎదురుగా వచ్చే కార్లను గుర్తించి, ఆటోమేటిక్‌గా వారిపై హై-బీమ్ పడకుండా లైట్స్ డిమ్ అవుతాయి. ఇలా చేయటం వలన అవతలి వారు హైబీమ్ వలన తమ దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉండదు.

సాధారణ హెడ్‌లైట్స్ కలిగిన కార్లలో రోడ్డుపై పాదచారులు ఉన్నప్పుడు కాంతి వారిపై పడి, వారి కళ్లకు ఏమీ కనిపించదు. కానీ, ఈ మ్యాట్రిక్స్ ఎల్ఈడి లైట్లు కలిగిన ఆడి కార్లు, రోడ్డుపై పాదచారులను గుర్తించి, వారిపై కాంతి పడకుండా అప్రమత్తం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడి మ్యాట్రిక్స్ ఎల్ఈడి లైట్లు రోడ్డుపై చాలా స్మార్ట్‌గా, సందర్భాన్ని పట్టి సమర్థవంతమైన పనితీరును చూపిస్తాయి.

ఆడి మ్యాట్రిక్స్ ఎల్ఈడి లైట్ల గురించి కంపెనీ చేసిన ఓ డెమో వీడియోని మనం కూడా చూద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/jDshTXFLsUk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
This animation explains the functions of the Audi TT Matrix LED headlights (Audi Matrix beam). Take a look.&#13;
Story first published: Monday, January 19, 2015, 18:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X