అత్యంత విలువైన టాప్-5 కార్ బ్రాండ్‌లు

By Anil

బ్రాండ్ అనేది చాలా విలువైనది ఎందుకంటే ఏ ఉత్పత్తిని అమ్మాలన్నా దానికి ఒక మంచి బ్రాండ్ ఉండాలి. ప్రస్తుత కాలంలో ఉత్పత్తులను కొనే వారు వస్తువు కన్నా దాని బ్రాండ్‌కే ఎక్కువ విలువనిస్తున్నారు. మరి ఆటోమొబైల్ విషయానికొస్తే ఇది మరీ ఎక్కువ.
Also Read: రెనొ క్విడ్ యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు

ప్రపంచం మొత్తం మీద గల ఆటోమొబైల్ తయారీదారులు తమను తాము ఉత్తమమైన కంపెనిగా నిరూపించుకోవడానికి వారి బ్రాండ్ వారికి ఎంతో సహకరిస్తుంది. బ్రాండ్ ఒక్కటే సరిపోదు ఈ ఆటోమొబైల్ ప్రపంచంలో పోటిని తట్టుకొని నిలబడాలంటే కొన్ని సంవత్సరాల పాటు అనుభవం, శ్రమ, మంచి బ్రాండ్, వినియోగదారుల సంతృప్తి మరియు అన్నింటికి మించి తీవ్ర పోటిని ఎదుర్కోవాలి.

Also Read: మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది...

అయితే ప్రపంచం మొత్తం మీద ఇలాగే గట్టి పోటిని తట్టుకొని ఉన్నత స్థానంలో ఉన్న టాప్-5 ఆటోమొబైల్ బ్రాండ్ల గురించి క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం.

5.వోక్స్ వ్యాగన్

5.వోక్స్ వ్యాగన్

ఈ మధ్య బాగా వార్తల్లోకి ఎక్కిన కంపెని వోక్స్ వ్యాగన్ ఎందుకంటారా. ఒక అనధికారక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకుని ఉద్గార పరీక్షలో పాల్గొని పరీక్షలలో విజయం సాధించింది. తరువాత ఇది ఎమిషన్ పరీక్షలను నిర్వహించే వారిని మోసం చేసిందని తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంది. ఫలితంగా ఇప్పుడు ఆ కార్ల నుండి వెలువడే ఉద్గారాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీని కారణం వలన వోక్స్ వ్యాగన్ సి.ఇ.వో రాజినామా కూడా చేశారు. జర్మనీకి చెందిన ఈ కార్ల కంపెని ఇప్పుడు ఐదవ స్థానంలో ఉంది ప్రస్తుతం దీని విలువ 12,545 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

Also Read: 2017 నాటికి ఐదు సరికొత్త మోడళ్లను విడుదల చేయనున్న వోక్స్ వ్యాగన్

4.హోండా

4.హోండా

జపాన్ కు చెంది ప్రముఖ కార్ల తయారీదారులైన హోండా కంపెని వృద్ది ఆరు శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెని యొక్క విలువ 22,975 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. మరియు హోండా తమ 34 సంవత్సరాల సుధీర్ఘకాలంలో దాదాపుగా 16,500,000 వాహనాలను అమ్మినట్లు తెలిపారు.

Also Read: తక్కువ ఫ్యూయల్ కన్సెమ్షన్‌లో హోండా గిన్నీస్ రికార్డ్

3.మెర్సిడెస్ బెంజ్

3.మెర్సిడెస్ బెంజ్

భారతదేశంలో లగ్జరీ కార్లుగా పిలవబడుతున్న సంస్థ మెర్సిడెస్ బెంజ్. ఇది జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారి కంపెని ఈ సారి ఇది 7 శాతం వృద్దిని కనబరిచింది. దీని విలువ దాదాపుగా 36,711 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది ఆడికి గట్టి పోటి ఇవ్వడంతో ప్రస్తుతం ఆడి టాప్-5 లో చోటు దక్కలేదు అయితే మొదటి స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: 2016 ఈ-క్లాస్ మోడల్ తో మెరవనున్న మెర్సెడిస్ బెంజ్

2.బిఎమ్‌డబ్ల్యూ

2.బిఎమ్‌డబ్ల్యూ

జర్మనీకి చెందిన మరొక లగ్జరీ కార్ల తయారి కంపెని బిఎమ్‌డబ్ల్యూ మొదట్లో ఇది కూడా వోక్స్ వ్యాగన్ తో పాటే నిందలు ఎదుర్కొవాల్సి వచ్చింది అయితే తరువాత అది పూర్తిగా తొలగపోయింది. ఈ సారి దీని వృద్ది 9 శాతముగా ఉంది మరియు దీని ప్రస్తుత విలువ 37,212 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

Also Read: బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపె అత్యధిక ధరతో విడుదల: మరి దీని ధర ఎంత?

1.టయోటా

1.టయోటా

జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారి కంపెని అయిన టయోటా మొదటి స్థానంలో ఉంది. టయోటాకు ఇంతకు ముందు వోక్స్ వ్యాగన్ తో గట్టి పోటి ఉండేది అయితే మొన్న జరిగిన డీజల్ ఎమిషన్ స్కామ్ వలన టయోటా మొదటి స్థానంలోకి రావడాని మార్గం సుగమం అయ్యింది. కేవలం అది మాత్రమే కాదు ప్రస్తుతం కంపెని విలువ 49,048 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

Most Read Articles

English summary
Brand value is something very important for a product to sell. The better the value, the better the product sells. That is the case for automobiles as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X