బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపె అత్యధిక ధరతో విడుదల: మరి దీని ధర ఎంత?

By Anil

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెని సరి కొత్త ఎమ్6 గ్రాన్ కూపెను అక్టోబర్ 1, 2015 న భారత్‌లో అత్యధిక ధరకు విడుదల చేశారు. దీనిని ధర ఎంతో తెలుసా? అక్షరాలా 1.71 కోట్ల రుపాయలు ఎక్స్-షోరూమ్ ( మహరాష్ట్ర ). అత్యంత శక్తివంతమైన ఈ ఎమ్6 కూపె యొక్క మరిన్ని విశేషాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.
Also Read:భారత్‍‌లో టాప్-5 200 సీసీ-250సీసీ బైక్‌లు: ధర మరియు ఫీచర్స్

ఇంజిన్ స్పెసిఫికేషన్స్ :

ఇంజిన్ స్పెసిఫికేషన్స్ :

సరి కొత్త బిఎమ్‌బ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపె లో 8-సిలిండర్, టర్బోచార్జ్‌డ్4,395సీసీ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ 560 హార్స్‌పవర్ మరియు 680 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ మరియు గరిష్ఠ వేగం 250 కెఎమ్/హెచ్ చేరుకోగలదు.

 ట్రాన్స్‌మిషన్ :

ట్రాన్స్‌మిషన్ :

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపెలో రియర్ వీల్ డ్రైవ్ కలదు మరియు ఇందులో డ్రైవ్ లాజిక్ అనే సాఫ్ట్‌వేర్ తో కలిసి పనిచేసే 7-స్పీడ్ ఎమ్ డబుల్ స్పీడ్ క్లచ్ కలదు. ఇందులో గల లాంచ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా కేవలం 4.2 సెకండ్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

సేఫ్టి ఫీచర్స్ :

సేఫ్టి ఫీచర్స్ :

  • 6- ఎయిర్ బ్యాగ్‌లు
  • డైనమిక్ డ్యాంపర్
  • డైనమిక్ మోడ్
  • ఆక్టివ్ డిఫరెన్షియల్
  • ఆక్టివ్ అసిస్ట్ ద్వారా ఆక్టివ్ అటెంన్షన్
  • ఆక్టివ్ హెడ్ రెస్ట్ (ముందువైపున)
  • మరిన్ని ఫీచర్స్ :

    మరిన్ని ఫీచర్స్ :

    • టచ్ కంట్రోల్ తో బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ ( ఆన్ బోర్డ్ డ్రైవర్ ఇన్ఫర్‌మేషన్)
    • బిఎమ్‌డబ్ల్యూ ఫుల్ కలర్ డిస్‌ప్లే
    • నావిగేషన్ ప్రొఫెషనల్ (జి.పి.యస్)
    • 25.9 సెం.మీ తాకే తెర మరియు 3డి మ్యాప్స్
    • బ్లూటూత్ పరికరాలతో అనుసందానమై ఉంటుంది
    • పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ (పి.డి.యస్), ఇందులో కెమెరాలు ఉండటం వలన పార్కింగ్ చేసేటప్పుడు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కెమెరాలో చూస్తూ పార్కింగ్ చేయవచ్చు.
    •  లభించు రంగులు :

      లభించు రంగులు :

      వినియోగదారులకు ఈ సరి కొత్త బిఎమ్‌బ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపెను తొమ్మిది రంగుల్లో అందిస్తున్నారు

      • ఆల్పైన్ వైట్
      • బ్లాక్ సప్పైర్
      • సిల్వర్ స్టోన్
      • స్పేస్ గ్రే
      • జటోబా
      • స్యాన్ మారినో బ్లూ
      • సకిర్ ఆరెంజ్
      • సింగపూర్ గ్రే
      • ఇంపీరియల్ బ్లూ మీకు అత్భుతమైన ఎఫెక్ట్‌ని ఇస్తాయి
      • మైలేజ్

        మైలేజ్

        బిఎమ్‌డబ్ల్యుూ లో గల ఎఫిషియంట్ డైనమిక్స్ యొక్క ఉన్నతమైన ఇంధన సామర్థ్యం మీకు ఇస్తుంది10.10 కిలోమీటర్/లీటర్ మైలేజ్. ఇందులో ఇంటెలిజెంట్ లైట్ వెయిట్ నిర్మాణం, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ మరియు ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ కీ వంటి మరిన్ని సదుపాయాలు కలవు.

        బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా, ప్రెసిడెంట్ గారి మాటల్లో

        బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా, ప్రెసిడెంట్ గారి మాటల్లో

        బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్, ప్రెసిడెంట్ అయిన పిలిప్ వోన్ సహర్ దీని గురించి మాట్లాడుతూ దీనినిలో ఆకట్టుకునే శక్తి, అత్బుతమైన సాంకేతికత మరియు ఇది మీకు నిజమైన అనుభూతిని ఇస్తుందని తెలుపారు. బిఎమ్‌డబ్ల్యుూ ఎమ్6 గ్రాన్ కూపెలో శక్తి, డైనమిక్స్, సౌకర్యం మరియు విలాసవంతమైనటువంటి మరిన్ని ప్రామాణికాలను జోడించారని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
The all-new BMW M6 Gran Coupé launched in India on 1 October 2015 priced at INR 1,71 crore ex-showroom (Maharashtra). BMW also launched the BMW M Studio showroom in Mumbai.
Story first published: Saturday, October 3, 2015, 14:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X