షెవర్లే బోల్ట్ ఉత్పత్తికి రంగం సిద్ధం.. 2016లో విడుదల..!

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్, గడచిన జనవరి నెలలో జరిగిన 2015 డెట్రాయిట్ ఆటో షోలో తమ సరికొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు 'షెవర్లే బోల్ట్' (Chevrolet Bolt)ను ఉత్పత్తి దశకు తీసుకువెళ్లేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ మోడల్ ఉత్పత్తిని మిచిగాన్‌లో ప్రారంభించి, అదే సంవత్సరంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావని కంపెనీ యోచిస్తోంది.

అత్యంత ఆకర్షనీయమైన డిజైన్‌తో రూపుదిద్దుకున్న షెవర్లే బోల్ట్ ఎలక్ట్రిక్ కారులో సింగిల్ చార్జ్‌పై 200 మైళ్లకు పైగా (సుమారు 322 కిలోమీటర్లు) దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. షెవర్లే బోల్ట్ కారును 30,000 డాలర్లు (సుమారు రూ.18.7 లక్షలు) ధరకు విక్రయించాలని జనరల్ మోటార్స్ భావిస్తోంది.

Chevrolet Bolt 01

షెవర్లే తమ బోల్ట్ ఎలక్ట్రిక్ కారును అమెరికాలోని అన్ని 50 రాష్ట్రాలలోను మరియు అనేక అంతర్జాతీయ మార్కెట్లలోను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న షెవర్లే స్పార్క్ (మన మార్కెట్లో బీట్) ఎలక్ట్రిక్ కారు మాత్రం కేవలం కాలిఫోర్నియా, ఓరెగాన్ మార్కెట్లలో మాత్రమే అమ్ముడుపోతోంది.

అల్యూమినియం, మెగ్నీషియం మరియు కార్బన్ ఫైబర్ వంటి తేలికపాటి పదార్థాలను ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ కారును చేశారు. అందుకే ఇది తేలిక బరువును కలిగి ఉండి, ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. షెవర్లే బోల్ట్ పూర్తి గ్లాస్ రూఫ్‌ని కలిగి ఉండి, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ని కలిగి ఉంటుందని కంపెనీ వివరించింది.

Chevrolet Bolt 02

షెవర్లే బోల్ట్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ఇంటీరియర్స్ పూర్తిగా ఫ్యూచరిస్టింగ్ లుక్‌ని కలిగి ఉంటాయి. ఈ కారును ఉపయోగించే వారు తమ స్మార్ట్ ఫోన్‌ను బోల్ట్ ఈవి కనెక్ట్ యాప్ సాయంతో కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా కార్ షేరింగ్‌ను కోఆర్డినేట్ చేసుకోవటం చేయవచ్చు. వాలెట్ ఫీచర్‌ను ఎంగేజ్ చేయటం ద్వారా ఈ కారు దానంతట అదే పార్క్ చేసుకోవటం, నిర్ధిష్ట సమయాన్ని సెట్ చేసిన తర్వాత పికప్ కోసం తిరిగి డ్రైవర్ వద్దకు రావటం జరుగుతుంది.

షెవర్లే బోల్ట్ కారులో మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, విభిన్న డ్రైవర్ల ఎంపిక మేరకు యాక్సిలరేటర్ మ్యాపింగ్, రైడ్ హైట్, సస్పెన్షన్ ట్యూనింగ్ వంటివి మారుతూ ఉంటాయి. ఇందులో డిసి ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్ సాయంతో ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీలను అతి తక్కువ సమయంలో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Chevrolet is under the leadership of General Motors, they had recently showcased its new electric vehicle at the Detroit Motor Show. They christened this vehicle as the ‘Bolt' EV, which will be launched soon.
Story first published: Saturday, February 7, 2015, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X