డిక్కీ ఓపెన్: టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ ఏఎమ్‌టి

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గడచిన సంవత్సరం ఆరంభంలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన 'టాటా నానో ట్విస్ట్ యాక్టివ్'కు ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీని జోడించే త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ ఏఎమ్‌టి వెర్షన్‌ను కంపెనీ ఇప్పటికే మహారాష్ట్ర రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ కారులో ఓపెనింగ్ టెయిల్ గేట్ (వెనుక (బూట్) డోర్ ఓపెన్) ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నానో మోడళ్లలో ఈ సౌకర్యం లేదు. టెయిల్ గేట్ ఓపెన్ ఫీచర్ వలన నానోలో మరింత ఎక్కువ లగేజ్ స్పేస్ లభిస్తుంది.

రెగ్యులర్ టాటా నానో కారులో వెనుక డోర్లను ఫోల్డ్ చేసినప్పుడు మాత్రమే అధిక బూట్ స్పేస్‌ను యాక్సెస్ చేసుకునే వీలుండేది. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ, కొత్త టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్లో సాంప్రదాయ హ్యాచ్‌బ్యాక్‌ల మాదిరిగా వెనుకవైపు బూట్ డోర్‌ను ఓపెన్ చేసి, స్టోరేజ్ స్పేస్‌ను యాక్సెస్ చేసుకునే వెసలుబాటు కల్పించింది.

Tata Nano Twist Active

ఓపెనింగ్ టెయిల్ గేట్ వలన టాటా నానో బరువు అదనంగా మరో 70 కేజీల వరకు పెరిగింది. దీని ఫలితంగా ఈ వేరియంట్ మైలేజ్ కాస్తంత తగ్గే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్ నానో రేంజ్‌ను, నానో ట్విస్ట్ యాక్టివ్ రేంజ్‌ను ఒకేమాదిరిగా ఉంచేందుకు కంపెనీ ఈ వేరియంట్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని 25 లీటర్లకు పెంచింది.

రెగ్యులర్ నానో ట్విస్ట్ వేరియంట్లతో పోల్చుకుంటే ఈ కొత్త టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్ కలర్ ఎయిర్ డ్యామ్‌తో కూడిన సరికొత్త బంపర్ డిజైన్, రివైజ్ చేయబడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ డిజైన్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

Most Read Articles

English summary
Tata Motors has been testing its AMT-equipped Nano Twist Active for a long time now. The new Tata Nano Twist Active AMT might hit the showrooms anytime soon.
Story first published: Wednesday, March 18, 2015, 12:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X