భారత్‌బెంజ్‌ బస్సు అమ్మకాలను షురూ చేసిన డైమ్లర్‌ ఇండియా

Written By:

డైమ్లర్ ఇండియా తమ స్టాఫ్ బస్ అమ్మకాలను ప్రారంభించింది. తమ మొదటి బస్సును ముంబాయ్‌లో వినిగదారులకు అందివ్వనుంది. అయితే తాము బస్సును ముంబాయ్‌లో ప్రారంభించిన తరువాత వాణిజ్యపరంగా దేశ వ్యాప్తంగా అన్ని డీలర్‌ షిప్‌లకు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.

డైమ్లర్ బస్సు గురించి మరిన్ని వివరాలు క్రింద గల స్లైడర్‌లలో...

డిజైన్

భారత్‌బెంజ్ తన స్టాఫ్ బస్సులో యునిక్యు పేటెంట్ పొందిన అల్యుమినిక్ మరియు ఏరోడైనమిక్ డిజైన్‌ను అందించారు.

సీటింగ్ కెపాసిట్

డైమ్లర్‌కు చెందిన భారత్‌బెంజ్ బస్సులో 39 మంది ప్రయాణించే వీలు ఉంది. మరియు దీని టన్నేజ్ కెపాసిటి తొమ్మిది టన్నుల వరకు ఇది మోయాగలదు.

ఇంజన్ లొకేషన్

భారత్‌బెంజ్ బస్సులో ఇంజన్‌ను రెండు రకాల స్థానాలలో అందించారు. అది ఫ్రంట్ ఇంజన్ మరియు బ్యాక్ ఇంజన్.

భద్రత

ఫ్రంట్ ఇంజన్ బస్సులో గల భద్రత పరమైన అంశాలు

  • యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబియస్)
  • వెనుక వైపున గల యాంటి-రోల్ బార్స్
  • మంటలను ఆర్పే పదార్థాలు మరియు
  • వ్యూహాత్మకంగా అమర్చిన అత్యవసర ద్వారాలు

వివిద రకాల అవసరాలకు

భారత్‌బెంజ్ బస్సు ప్రస్తుత కాలంలో వివిద రకాల అవసరాలకు ఉపయోగపడనుంది. పాఠశాలలకు, కాలేజిలకు, కంపెనీలలో స్టాఫ్ బస్సులుగా మరియు విహారయాత్రల ప్రయాణాలకు ఇవి ఎంతో అనువుగా ఉంటాయి.

 

తయరీ

ఈ భారత్‌బెంజ్ బస్సులను డైమ్లర్ ఇండియా చెన్నై‌ ప్లాంట్ తయారీని ప్రారంభించింది. ఈ ప్లాంటు సంవత్సరానికి 1500 బస్సులను ఉత్పత్తి చేయగల కెపాసిటి కలదు.

425 కోట్లు

డైమ్లర్ ఇండియా భారత్‌బెంజ్ బస్సుల తయారీకి చెన్నై ప్లాంటులో దాదాపుగా 425 కోట్ల రుపాయల పెట్టుబడి పెట్టింది. మొదట్లో భారత్‌బెంజ్ బస్సులను దాదాపుగా 80 డీలర్‌షిప్‌ల నుండి అందుబాటులోకి తీసుకురానుంది.

 

Story first published: Tuesday, November 17, 2015, 15:12 [IST]
English summary
Daimler India Starts BharatBenz Bus Production
Please Wait while comments are loading...

Latest Photos