డాట్సన్ గో కారులో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్!?

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కి చెందిన డాట్సన్ ప్రస్తుతం భారత మార్కెట్లో గో హ్యాచ్‌బ్యాక్, గో ప్లస్ ఎమ్‌పివిలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారుకు ఇటీవల నిర్వహించిన గ్లోబల్ క్రాష్ టెస్టులో జీరో స్కోర్ రావటంతో ఈ మోడల్ సేఫ్టీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

డాట్సన్ గో కారులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్స్ వంటి కనీస సేఫ్టీ ఫీచర్లు కూడా లేవు. ఈ నేపథ్యంలో, డాట్సన్ గో కారులో ఈ రెండు సేఫ్టీ ఫీచర్లను (ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్)ను ఆఫర్ చేయాలని నిస్సాన్ భావిస్తున్నట్లు సమాచారం.

datsun go airbag

ఒకవేళ నిస్సాన్ తమ డాట్సన్ గో కారులో ఈ సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేసినట్లయితే, సేఫ్టీకి ప్రాధాన్యతనిచ్చే కస్టమర్లు కాస్తంత ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదని ఈ కారును కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను టార్గెట్‌గా చేసుకొని నిస్సాన్ తమ బడ్జెట్ బ్రాండ్ డాట్సన్‌ను ప్రవేశపెట్టింది.

ఆ క్రాష్ టెస్టులో డాట్సన్ గో బాడీ నిర్మాణం కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు తేల్చారు. దీంతో గో బాడీకి మరింత ధృడత్వాన్ని కల్పించేందుకు కూడా డాట్సన్, నిస్సాన్ ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. అధిక ధృడత్వం కోసం ఇంప్రూవ్డ్ టెన్సైల్ స్టీల్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. మరి ఈ అప్‌డేట్స్ డాట్సన్ గో సేఫ్ కారుగా నిలుస్తుందంటారా..?

Most Read Articles

English summary
Nissan is contemplating of launching a new variant of Datsun Go that will feature ABS and airbags. This will be a huge addition and we believe customers will be more than willing to pay for these added features.
Story first published: Tuesday, March 24, 2015, 16:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X