2015 డెట్రాయిట్ ఆటో షో: ల్యాండర్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తమ సరికొత్త '2015 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్' మోడల్‌ను ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించడం జరిగింది. కాగా.. జేఎల్ఆర్ ఇప్పుడు డెట్రాయిట్‌లో జరుగుతున్న 2015 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో జేఎల్ఆర్, ఇండియాకు రానున్న కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది.

ప్రస్తుతం ల్యాండ్ రోవర్ బ్రాండ్‌లో లభిస్తున్న పాపులర్ మోడల్ ఫ్రీల్యాండర్ 2 మోడల్ స్థానాన్ని ఈ కొత్త డిస్కవరీ స్పోర్ట్ భర్తీ చేయనున్నట్లు సమాచారం. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఓ గ్లోబల్ మోడల్. ఇది పలు అంతర్జాతీయ మార్కెట్లలో (ఇండియాలో కూడా) లభ్యం కానుంది. ముందుగా యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత 2015 మధ్య భాగం నాటికి ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2015 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మోడల్‌కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం రండి..!

ల్యాండర్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

కొత్త 2015 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఇటీవలే నిర్వహించిన యూరో ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్టులో అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుని, సురక్షితమైన కారుగా నిలిచింది.

ల్యాండర్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

కొత్త 2015 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మోడల్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ అయినప్పటికీ, కస్టమర్ల ఇష్టం ఎంపిక మేరకు ఇది 7-సీటర్, 5-సీటర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

ల్యాండర్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

డిస్కవరీ స్పోర్ట్‌ను ల్యాండ్ రోవర్ నుంచి అత్యంత పాపులర్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినప్పటికీ, ఎవోక్‌తో పోల్చుకుంటే ఇందులో 50 శాతం కొత్త భాగాలను ఉపయోగించారు.

ల్యాండర్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

ఈ మోడల్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అందులో ఒకటి 2.0 ఎస్ఐ4 పెట్రోల్, 9-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్. మిగిలినవి 2.2 టిడి4 డీజిల్ మరియు 2.2 ఎస్‌డి4 డీజిల్ వేరియంట్. ఇవి రెండూ 9-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లతో లభ్యం కానున్నాయి.

ల్యాండర్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

కొత్త 2015 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఈ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ఆడి క్యూ5, వోల్వో ఎక్స్‌సి60 వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Most Read Articles

English summary
At the ongoing 2015 Detroit Motor show Land Rover has pulled the cover off its Discovery Sport model. This new luxury SUV is set to take the place of their popular Freelander 2 vehicle. It is expected to be offered in India as well.
Story first published: Thursday, January 15, 2015, 16:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X