ఈకోస్పోర్ట్‌ ఎస్‌యూవీలో ఫోర్డ్ యాప్ లింక్ అప్‌డేట్

By Ravi

ఫోర్డ్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈకోస్పోర్ట్‌లో అధునాతన స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్‌తో కూడిన సింక్ అప్లికేషన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ సిస్టమ్‌కు అదనంగా ఫోర్డ్ మరిన్ని కొత్త టెక్నాలజీ ఫీచర్లను జోడించింది.

ఫియస్టా సెడాన్‌లో ఫోర్డ్ యాప్ లింక్ పేరిట కంపెనీ అందిస్తున్న టెక్నికల్ అప్‌డేట్‌ను కంపెనీ ఇప్పుడు తమ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో కూడా పరిచయం చేసింది. ఈ యాప్ లింక్ ద్వారా మ్యాప్‌మైఇండియా, గ్లింప్స్, ఈఎస్‌పిఎమ్ క్రిక్ఇన్ఫోలను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.

Ford EcoSport

ప్రస్తుతం ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో, క్రికెట్ అభిమానుల కోసం ఫోర్డ్ తమ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో యాప్ లింక్‌ను ప్రవేశపెట్టింది. ఫోర్డ్ యాప్ లింక్ పరిచయం ద్వారా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఆఫర్ చేస్తున్న విలువైన ఫీచర్ల జాబితా పెరిగిందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ సేల్స్ అండ్ సర్వీస్) అనురాగ్ మెహ్రోతా తెలిపారు.

నేటి తరం వినియోగదారులు మరిన్ని స్మార్ట్ ఫీచర్లను కోరుకుంటున్నారని, నేటి ఆధునిక జీవనశైలికి తగినట్లుగా ఈకోస్పోర్ట్‌లో కొత్త యాప్ లింక్ ఫీచర్‍‌ను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
Ford EcoSport is the best selling vehicle from the American manufacturers stable. Their compact SUV is filled with gadgets and several safety equipment. The EcoSport was one of the first vehicles to be fitted with SYNC, it helps occupants to access their smartphone applications through voice commands from the vehicle.
Story first published: Tuesday, February 24, 2015, 19:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X