హోండా కార్లపై పెయింట్ మరకలు; డిశ్పాచ్ నిలిపివేత

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియాకు గ్రేటర్ నోయిడాలో ఓ తయారీ కేంద్ర ఉన్న సంగతి తెలిసినదే. తాజాగా ఆ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యి, డిశ్పాచ్‌కు సిద్ధంగా ఉన్న కొన్ని కార్లు డ్యామేజ్ అయ్యాయి. హోండా నోయిడా ప్లాంట్‌కు ఆనుకొని ఉన్న మరో ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా ఆ కార్లు డ్యామేజ్ అయినట్లు సమాచారం.

హోండా నోయిడా ప్లాంటుకు సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వచ్చిన పెయింట్ ఫ్యూమ్స్ (పెయింట్ మరకలు), స్టాక్ యార్డులో పార్క్ చేసిన హోండా కార్లు దెబ్బతిన్నాయి. సాధారణంగా, హోండా కార్స్ ఇండియా తాము ఉత్పత్తి చేసి, డిశ్పాచ్‌కు సిద్ధంగా ఉంచిన కార్లను ఓపెన్ స్టాక్ యార్డులలో ఉంచుతారు.

Honda Greater Noida Facility Stops Vehicle Dispatch Due To Damage

ఈ నేపథ్యంలో, పక్కనే ఉన్న ప్లాంట్‌‌ల నుంచి వచ్చిన పడిన పెయింట్ మరకు స్టాక్ యార్డులో పార్క్ చేసి ఉన్న కార్లపై పడి డ్యామేజ్ కలిగించాయి. ఈ పెయింట్ ఫ్యూమ్స్ ప్రోడక్ట్ క్వాలిటీని దెబ్బతీస్తాయనే ఉద్దేశ్యంతో కంపెనీ వీటి డిశ్పాచ్‌ను నిలిపివేసింది. ఈ కార్లను తిరిగి ప్లాంట్‌లోకి తీసుకువెళ్లి పాడైన భాగాలను సరిచేస్తారు.

హోండా గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో బ్రియో హ్యాచ్‌బ్యాక్, సిఆర్-వి ఎస్‌యూవీ మరియు మొబిలియో ఎమ్‌పివిలు ఉత్పత్తి అవుతున్నాయి. ఖచ్చితంగా ఎన్ని కార్లు డ్యామేజ్ అయ్యాయనే విషయం తెలియకపోయినప్పటికీ, సుమారు 4,000 కార్ల వరకూ దెబ్బతిని ఉంటాయని అంచనా. ఈ పెయింట్ కార్లపై ఉండే ప్లాస్టిక్ భాగాలను, క్రోమ్ భాగాలను డ్యామేజ్ చేసినట్లు సమాచారం.

Most Read Articles

English summary
Honda India has stopped the dispatch of vehicles from Greater Noida facility as there could be certain damages. The issue has been created due to paint fumes that have been released by factories in the surrounding vicinity. Japanese manufacturer believes that this could effect the quality of their product.
Story first published: Thursday, March 12, 2015, 14:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X