మరోసారి హోండా జాజ్ విడుదల వాయిదా.. జూన్‌లో రావచ్చని అంచనా!

By Ravi

హోండా కార్స్ ఇండియా నుంచి ఈ ఏడాది ఆరంభంలో విడుదల కావల్సిన సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ విడుదల మరోసారి వాయిదా పడింది. ఉత్పత్తి సామర్థ్యంతో పాటుగా పలు ఇతర కారణాల కారణంగా జాజ్ విడుదల జాప్యం అవుతోంది.

కాగా.. హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను రానున్న జూన్ నెలలో విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. జాజ్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిలో లోకలైజేషన్‌ను పెంచడం ద్వారా సరసమైన ధరకే దీనిని అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Honda Jazz

హోండా జాజ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడల్‌కు పోటీగా నిలువనుంది. ఇంజన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి:

పెట్రోల్ ఇంజన్:
హోండా జాజ్ పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 87 బిహెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హోండా బ్రియో, అమేజ్ మోడళ్లలో కూడా ఇదే పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

డీజిల్ ఇంజన్:
హోండా జాజ్ డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హోండా అమేజ్, సిటీ, మొబిలియో మోడళ్లలో కూడా ఇదే డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

Honda Jazz Rear

హోండా జాజ్ ఫీచర్లు:
  • యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
  • ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)
  • వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్
  • ఫ్రంట్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్
  • సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్
Most Read Articles

English summary
Japanese automobile giant, Honda is expected to launch its premium hatchback in India. Now the manufacturer seems to have delayed the launch once again and has pushed it further behind to June, 2015. Various factors have this time delayed the launch and one of the main reasons is the production capacity.
Story first published: Wednesday, March 11, 2015, 10:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X