రీకాల్ సమస్య: హోండా మోటార్ సీఈఓ రాజీనామా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్ కార్పోరేషన్, ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ చరిత్రలో కెల్లా అతి దారుణమైన రీకాల్ పరిస్థితిని ఫేస్ చేసింది. హోండా కార్లలో ఉపయోగించిన థర్డ్ పార్టీ ఎయిర్‌బ్యాగ్స్‌ల ద్వారా తలెత్తిన సమస్యలతో పరిశ్రమలో కంపెనీ పేరు మారుమ్రోగింది. నాణ్యతలో హోండా చేతులెత్తేసిందనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, ప్రస్తుతం హోండా మోటాక్ కార్పోరేషన్‌కు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టకనోబు ఇటో ఈతన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ హోదాలో దాదాపు 6 ఏళ్లు పనిచేసిన టకనోబు హోండా కంపెనీకి సీఈఓగా తప్పుకున్నప్పటికీ, బోర్డు సభ్యునిగా మరియు సలహాదారుగా వ్యవహరించనున్నారు.

Honda To Appoint New CEO By Late 2015 After Largest Recall Till Date

హోండా సంస్థలో పలు యాజమాన్య మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయి. ప్రొడక్షన్ హెడ్ టకాషి యమమోటో మరియు హోండా ఆర్ అండ్ డి హెడ్ యోషిహరు యమమోటులు కూడా తమ పదవుల నుంచి తప్పుకోనున్నారు.

ఆటోమొబైల్ చరిత్రలోనే టకాటా ఎయిర్‌బ్యాగ్ రీకాల్ అతిపెద్ద రీకాల్‌గా పరిణమించింది. టకాటా సంస్థ తయారు చేసిన ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించిన అనేక కంపెనీలు ఇంకా తమ వాహనాలను రీకాల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సంస్థ నుంచి అత్యధికంగా ఎయిర్‌బ్యాగ్‌లను కొనుగోలు చేసిన కంపెనీలలో హోండా మోటార్ కూడా ఒకటి.

Most Read Articles

English summary
Japanese automobile giant, Honda faced the worst recall of vehicles in automobile history. There was an issue in their airbags due to a quality defect by its producer. It was a major setback for Honda and they are still to come to terms with the largest recall till date.
Story first published: Tuesday, February 24, 2015, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X