సరి కొత్త మార్పులతో రానున్న హ్యుందాయ్ క్రెటా

By Anil

కొరియాకు చెందన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ ఆరు నెలల్లో తన ఏకైక క్రెటా యస్‌.యు.వి మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ కార్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల డీజల్ ఇంజన్‌తో రానున్నాయి. మరి దీనికి ఇంత ప్రత్యేకత ఎందుకంటారా ఇంత వరకు ఎలాంటి యస్.యు.వి మోడల్స్‌లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల అవకాశం లేదు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్! టయోటా కొత్త కారు ప్రియస్ ఆవిష్కరణ

అయితే ఇప్పటికే క్రెటా మోడల్ కార్లు భారతీయ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి. ఇవి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఏదయితేనేం తమ డీజల్ వేరియంట్లలో ఆప్షనల్ ట్రాన్స్‌మిషన్ తీసుకురావాలని ఉన్న హ్యుందాయ్ కోరిక దీని వలన తీరనుంది.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: మినీ ట్రక్కును మరియు ఎనిమిది సీట్ల మినీ వ్యాన్‌లను పరిచయం చేసిన మహీంద్రా.

హ్యుందాయ్ క్రెటా యొక్క మరిన్న విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

క్రెటా ఇంజన్ :

క్రెటా ఇంజన్ :

శక్తివంతమైన హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్ మోడల్‌లో 1582 సీసీ గల సిఆర్‌డిఐ ఇంజన్ కలదు మరియు ఇది 126.19 హార్స‌పవర్, 259.87 అత్యధిక టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ యస్.యు.వి లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు.

క్రెటా డిజైన్ :

క్రెటా డిజైన్ :

హ్యుదాయ్ 2.0 క్రెటా ఫ్లూయిడిక్ యొక్క డిజైన్ టెక్నిక్స్ భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన ఐ20 హ్యాచ్‌బ్యాక్ యొక్క డిజైన్ ప్రేరణతో రూపొందించబడినది.

క్రెటా ధరలు :

క్రెటా ధరలు :

హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్ సింగల్ ట్రిమ్ అప్షన్, యస్‌ఎక్స్ +. దీని ధర రూ 14,23,865 (ఎక్స్-షోరూమ్, ముంబయ్) గా ఉంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ కూడా ఇదే.

క్రెటా యొక్క కొలతలు :

క్రెటా యొక్క కొలతలు :

సరికొత్త క్రెటా పొడవు 4270 ఎమ్ఎమ్, 1780 ఎమ్ఎమ్ వెడల్పు, 2590 ఎమ్ఎమ్ ఎత్తు గా వీటి కొలతలు ఉన్నాయి. అయితే నిస్సాన్ టెర్రానొ మరియు రెనొ డస్టర్ కన్నా ఎక్కువ స్థలం ఇందులో ఉంది.

మైలేజ్ :

మైలేజ్ :

  • క్రెటా పెట్రోల్ 1.6: 15.29 కిలోమీటర్/లీటర్
  • క్రెటా డీజల్ 1.4: 21.38 కిలోమీటర్/లీటర్
  • క్రెటా డీజల్ 1.6: మ్యాన్యువల్ 19.67 కిలోమీటర్/లీటర్
  • క్రెటా డీజల్ 1.6: ఆటోమేటిక్ 17.01 కిలోమీటర్/లీటర్
  • పోటి :

    పోటి :

    హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్ మోడల్ యస్.యు.వి ప్రస్తుతం మోర్కెట్లో ఉన్న రెనొ డస్టర్, నిస్సాన్ టెర్రానొ, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మారుతి యస్-క్రాస్ మోడళ్లకు గట్టి పోటిని ఇస్తోంది.

    భద్రత :

    భద్రత :

    భద్రత దృష్ట్యా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్‌లను అందించారు. మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, వెహికల్ స్టెబిలిటి మేనేజ్‌మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, స్టాటిక్ బెండింగ్ లైట్స్, మరియు హైట్-అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ యాంకర్ ఇందులో ఉన్నాయి.

     అత్భుతమైన రోడ్ ఫర్ఫామెన్స్ :

    అత్భుతమైన రోడ్ ఫర్ఫామెన్స్ :

    క్రెటా యొక్క రోడ్ పికప్ గురించి చెప్పాలంటే ఎంతో స్ట్రీట్ ఫర్ఫామెన్స్ ఎంతో బాగుంటుంది. హైవేలో దీని ప్రయాణం మీకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

    ఫేస్‌బుక్ ప్రేమ :

    ఫేస్‌బుక్ ప్రేమ :

    హ్యుందాయ్ ఈ మధ్యనే ఫేస్‌బుక్ ఖాతా తెరిచింది. ఇందులో ఇది దాదాపుగా 60 లక్షల మంది అభిమానుల్ని పొందింది. కొరియాకు చెందిన ఈ ఆటోమొబైల్ సంస్థ కేవలం నాలుగు సంవర్సరాల క్రితం ఈ ఖాతా తెరిచినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా ఇలా ఇంత మందితో స్నేహం చేసింది.

Most Read Articles

English summary
The Hyundai Creta automatic version has a waiting period of six months in the country. It is the only compact SUV in India to be offered with an automatic transmission for the diesel engine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X