మార్చ్ 13 నుంచి 19వ ఎడిషన్ హ్యుందాయ్ ఫ్రీ కార్ కేర్ క్లినిక్

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, తమ కస్టమర్ల కోసం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉచిత కార్ కేర్ క్లినిక్‌ను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ తమ కస్టమర్ రిలేషన్‌షిప్ ప్రోగ్రామ్‌లో 19వ ఎడిషన్ 'ఫ్రీ కార్ కేర్ క్లినిక్'ని మార్చ్ 13, 2015వ తేది నుంచి మార్చ్ 22, 2015వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత హ్యుందాయ్ షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్ల వద్ద నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Hyundai To Introduce Free Car Care Clinic

మొత్తం పది రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత కార్ కేర్ క్లినిక్‌లో భాగంగా, షోరూమ్‌లు/సర్వీస్ సెంటర్లకు తీసుకువచ్చే హ్యుందాయ్ వాహనాలకు ఉచింగా 90-పాయింట్ చెకప్‌ను చేసి, ఏవైనా లోపాలు ఉంటే సరిచేయటం జరుగుతుంది.

ఈ 90-పాయింట్ చెకప్‌లో భాగంగా.. ఎయిర్-కండిషనింగ్, ఇంజన్, ఎలక్ట్రికల్ సిస్టమ్, ట్రాన్సిమిషన్, అండర్-బాడీ మొదలైన అనేక కీలక అంశాలను ఈ 80-పాయింట్ చెకప్‌లో పరిశీలిస్తారు. అంతేకాకుండా.. ఈ క్యాంపైన్‌లో భాగంగా కంపెనీ తమ కస్టమర్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా ఆఫర్ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్‌ను సందర్శించండి.

Most Read Articles

English summary
Hyundai India has will now be organising its 19th edition of ‘Free Car Care Clinic'. It will be held for ten days from 13th March to 22nd March, 2015. Every Hyundai owner can get a comprehensive check up for their vehicle across India.
Story first published: Thursday, March 12, 2015, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X