2015 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ టక్సన్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కాన్సెప్ట్

By Ravi

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న టక్సన్ ఎస్‌యూవీలో కంపెనీ సరికొత్త కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. టక్సన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ ప్లగ్-ఇన్-హైబ్రిడ్ (పిహెచ్ఈవి) వాహనాన్ని 2015 జెనీవా మోటార్ షోలో హ్యుందాయ్ ప్రదర్శనకు ఉంచింది.

హ్యుందాయ్ టక్సన్ ప్లగ్-ఇన్-హైబ్రిడ్ కారులో 1.7 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 115 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ కారులో ఓ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంది. ఈ మోటార్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 10.7 కివా లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీతో నడుస్తుంది.

hyundai tucson unveiled

డీజిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి గరిష్టంగా 183 పిఎస్‌ల శక్తిని, 474 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కేవలం లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ సాయంతోనే ఈ కారు 50 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఇందులోని ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

హ్యుందాయ్ టక్సన్ ప్లగ్-ఇన్-హైబ్రిడ్ కారు కిలోమీటరుకు 48 గ్రాముల కన్నా తక్కువ కర్భన వ్యర్థాలను (సిఓ2) విడుదల చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారు వెనుక భాగంలో అమర్చబడి ఉండి, వెనుక చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. అలాగే, ఇందులోని డీజిల్ ఇంజన్ ఫ్రంట్ యాక్సిల్‌కు పవర్‌ను అందిస్తుంది.

ఈ కాన్ఫిగరేషన్ వలన కారును ఫ్రంట్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్‌కి మార్చుకునేందుకు వీలవుతుంది. హ్యుందాయ్ టక్సన్ పిహెచ్ఈవి కాన్సెప్ట్ నాలుగు డ్రైవ్ మోడ్స్‌తో కూడా లభిస్తుంది. అవి -

  • ఆటో: ఈ మోడ్‌లో అన్ని సిస్టమ్స్ ఆపరేట్ అయ్యి, అత్యధిక మైలేజ్ లభిస్తుంది.
  • జీరో ఎమిషన్ వెహికల్: ఈ మోడ్‌లో కేవలం ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే పనిచేస్తుంది.
  • ఫోర్-వీల్ డ్రైవ్: ఈ మోడ్‌లో రెండు ఇంజన్లు పనిచేస్తాయి.
  • స్పోర్ట్: ఈ మోడ్‌లో రెండు ఇంజన్ల పెర్ఫార్మెన్స్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
Most Read Articles

English summary
Hyundai's concept of a plug-in-hybrid vehicle (PHEV), which is also based on the Tucson platform was showcased during the 2015 Geneva Motor Show.
Story first published: Friday, March 6, 2015, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X