క్రాష్ టెస్టులో హోండా జాజ్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్!

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, త్వరలో భారత మార్కెట్లో తమ సరికొత్త 2015 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. కాగా.. ఈ కొత్త జాజ్ ఆస్ట్రేలియా మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ఏఎన్‌సిఏపి) నిర్వహించిన క్రాష్ టెస్టులో కొత్త హోండా జాజ్ అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.

ఈ క్రాష్ టెస్టులో సాధారణంగా ఏ కారైనా సాధించే గరిష్ట స్కోర్ 37 పాయింట్లు. కాగా.. ఇందులో హోండా 36.58 పాయింట్లు స్కోర్ చేసి, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, స్టెబిలిటీ కంట్రోల్, రివర్సింగ్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉండటం మూలానే, కొత్త హోండా జాజ్ అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోగలిగింది.

2015 honda jazz crash test

కాగా.. హోండా కార్స్ ఇండియా ఇప్పటికే తమ కొత్త జాజ్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. అయితే, ఈ మేడ్ ఇన్ ఇండియా హోండా జాజ్ కారును భారత్ కన్నా ముందుగా దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల కానుంది. ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తి అయిన జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ దక్షిణాఫ్రికా మార్కెట్‌కు ఎగుమతి చేస్తోంది. భారత్‌లో హోండా జాజ్ ఈ సెగ్మెంట్లో నేరుగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20తో పోటీ పడనుంది.

భారత మార్కెట్లో కొత్త 2015 హోండా జాజ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 117 హెచ్‌పిల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమేజ్, సిటీ, మొబిలియో మోడళ్లలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించనున్నట్లు సమాచారం.

హోండా జాజ్ ఏఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ వీడియో:

<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/e9sqbDpUQ74?rel=0&showinfo=0&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

Most Read Articles

English summary
The Australian New Car Assessment Program or ANCAP has tested the 2015 Jazz. They put Honda's hatchback through front end and side collisions. Honda's Jazz has passed the crash test with flying colours and has secured a 5-star rating.
Story first published: Friday, January 30, 2015, 17:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X