తాళ్లపై మనిషి నడవటం చూశారు, కానీ కారు నడవటం చూశారా?

By Ravi

మనం ఇప్పటి వరకూ తాళ్లపై మనుషులు, కోతులు నడుస్తూ విన్యాసాలు చేయటం చూశాం. సర్కస్‌లో అయితే, తాళ్లపై సైకిల్ తొక్కడాన్ని కూడా చూసుంటాం. కానీ తొలిసారిగా తాళ్లపై కారును నడపటాన్ని మన ఈ వీడియోలో చూడబోతున్నాం. వివరాల్లోకి వెళితే..

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ తయారు చేసిన సరికొత్త 'జాగ్వార్ ఎక్స్ఎఫ్' (Jaguar XF) సెడాన్ విడుదలను వినూత్న రీతిలో నిర్వహించింది. లండన్‌లోని థేమ్స్ నదికి ఇరువైపులా భారీ క్రేన్లను ఉంచి, వాటికి బిగించిన తాళ్లపై ఈ జాగ్వార్ కారును నడుపుతూ, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ రోమాంచక స్టంట్‌ను ప్రముఖ బ్రిటీష్ స్టంట్‌మ్యాన్ జిమ్ డౌడాల్ నిర్వహించాడు. ఇతను జేమ్స్ బాండ్, బౌర్న్ సుప్రమసీ, ఇండియా జోన్స్ వంటి అనేక హాలీవుడ్ సినిమాల్లో స్టంట్‌మ్యాన్‌గా పనిచేశాడు. కేవలం 34 మి.మీ. వ్యాసార్థం ఉన్న తాడుపై కారును నది ఒక చివర నుంచి మరొక చివరకు డ్రైవ్ చేశాడు.

ఈ సందర్భంగా జాగ్వార్ ప్రతినిధులు తమ సరికొత్త ఎక్స్ఎఫ్ కారులోని పలు విశిష్టతలను తెలియజేశారు. ఈ కారు బాడీని కార్బన్ ఫైబర్‌తో తయారు చేయటం మూలంగా, దీని బరువు చాలా తేలికగా ఉంటుందని తెలిపారు.

మరి ఆ అద్భుతమైన స్టంట్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!

<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/aTpomhzh83k?rel=0&showinfo=0&autoplay=0" frameborder="0" allowfullscreen></iframe>

Most Read Articles

English summary
The British based automobile manufacturer revealed its all-new XF in London. Jaguar XF was suspended from the sky over Thames river, they had a water crossing stunt done for the very first time.
Story first published: Thursday, March 26, 2015, 11:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X