భారతీయ మార్కెట్లోకి రెనిగేడ్ జీప్ కాంపాక్ట్ యస్‌యువి

By Anil

అంతర్జాతీయంగా జీపులకు మంచి బ్రాండ్ గా పేరు గల ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్‌సిఎ) వారు భారతీయ మార్కెట్లోకి తమ జీపులను పరిచయం చేయాలని భావిస్తున్నారు. అందుకోసం 2016 లో జరగబోయే ఢిల్లీ ఆటో ఎక్స్‌‌-పో ను వేదికగా చేసుకుంటున్నారు. ఈ ఆటో ఎక్స్‌-పో ద్వారా తమ కాంపాక్ట్ యస్‌‌యువి జీప్ రెనిగేడ్ ను ప్రదర్శించనున్నారు.
మరింత చదవండి: భారతీయ మార్కెట్లో అమ్మకాలను విరమించుకున్న టాప్-10 మోడల్స్

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ వారు ఇండియన్ మార్కెట్లోకి తమ జీప్ రెనిగేడ్ ద్వారా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడిప్పుడే భారతీయులు వ్యక్తిగతంగా జీపులను ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీని దృష్ట్యా వీరు భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్నారని తెలిస్తోంది. ఈ జీప్ రెనిగేడ్ గురించి మరింత సమాచారం క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 యువత కోసం

యువత కోసం

రెనిగేడ్ జీపును భారత్ కు దిగుమతి చేసుకోవడం కూడా జరిగింది. దీనిని 2016 ఆటో ఎక్స్-పోలో ప్రదర్శించిన తరువాత అమ్మకాలకు సిద్దం చేయాలని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశంలో ఉన్న యువత కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు.

ఇంజన్

ఇంజన్

దిగుమతి చేసుకుంటున్న ఈ జీప్ రెనిగేడ్ లో 2.0-లీటర్ ఎమ్‍‌‌‌జెడి 2 డీజల్ ఇంజన్ కలదు. దీని పని తీరు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న జీపు కన్నా కొంత డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపారు.

ట్రాన్స్‌‌మిషన్

ట్రాన్స్‌‌మిషన్

ఇందులో గల ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను కలిగి ఉంది. అయితే ఇందులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేదన్నారు.

డిజైన్

డిజైన్

దీని బాహ్య భాగాలు ఎంతో ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. ఈ కాంపాక్ట్ యస్‌యువి రూపం మన భారతీయుల అభిరుచికి దగ్గరా ఉండే విధంగా రూపొందించారు.

మొత్తం మీద దీని డిజైన్ స్మూత్ అండ్ స్టైలిష్ అని చెప్పవచ్చు.

మరిన్ని మోడల్స్

మరిన్ని మోడల్స్

2016 లో జరిగే ఆటో ఎక్స్-పోలో జీప్ రెనిగేడ్ తో పాటుగా వ్రాంగ్లర్ మరియు చెరోకీ యస్‌‌యువి వంటి మోడల్స్‌ను ప్రదర్శించనున్నారు. ఇలాంటి జీపులకు చెందిన సమాచారం కోసం డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

ఎంతో మంది చదివిన కథనాలు...
  1. టాటా జికా వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10: ఇందులో ఏది ఉత్తమం?
  2. ఇండోనేషియాలో విడుదలైన హోండా బిఆర్-వి: అతి త్వరలో భారత్‌లోకి
  3. కార్లపై భారీ రాయితీ ; సంవత్సరాంతపు ఆఫర్లను మిస్ కావద్దండి

Most Read Articles

English summary
Jeep Renegade Compact SUV To Debut At 2016 Auto Expo
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X