చిట్టచివరి బుగాటి వేరాన్ 'లా ఫినాలే' అమ్ముడుపోయింది..

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారు 'బుగాటి వేరాన్' (Bugatti Veyron) శకం ముగిసింది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కారుగా చరిత్ర సృష్టించిన బుగాటి వేరాన్ ఇప్పుడు అదే చరిత్రలో కలిసిపోయింది. చిట్టచివరి బుగాటి వేరాన్‌ను కంపెనీ మిడిల్ ఈస్ట్‌కి చెందిన ఓ కస్టమర్‌కి విక్రయించింది. ఈ ఆఖరి బుగాటి వేరాన్‌కు 'లా ఫినాలే' (La Finale) అనే పేరును పెట్టారు.

'బుగాటి వేరాన్ లా ఫినాలే' ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన 450వ వేరాన్ కార్. ఈ చిట్టచివరి బుగాటి వేరాన్‌ను మార్చ్ నెలలో జరగనున్న 2015 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. ఈ చివరి కారుతో పాటుగా బుగాటి తొలిసారిగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి వేరాన్ కారును కూడా ఈ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచుతారు.

last bugatti veyron sold

ఈ నేపథ్యంలో, బుగాటి తమ ఆఖరి వేరాన్‌కు సంబంధించి ఓ టీజర్ ఫొటోని విడుదల చేసింది. ఇదే చిట్టచివరి బుగాటి వేరాన్ అని తెలియజేసేందుకు గాను ఈ మోడల్‌పై కంపెనీ ప్రత్యేకమైన బ్యాడ్జ్ లేదా ఐడెంటీ కోసం ఏదైనా మార్పులు చేసే అవకాశం ఉంది.

కాగా.. బుగాటి వేరాన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వస్తున్న మోడల్‌ను 'చిరాన్' (Chiron) అని పిలిచే అవకాశం ఉంది. ఈ మోడల్‌లోని ఇంజన్ గరిష్టంగా 1500 హార్స్ పవర్‌ల శక్తిని విడుదల చేస్తుందని అంచనా. ఇందులో రెండు ఎలక్ట్రికల్లీ పవర్డ్ టర్బోచార్జర్లు ఉండనున్నాయి. బుగాటి వేరాన్ కన్నా బుగాటి చిరాన్ అత్యంత వేగవంతమైన కారుగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

బుగాటి తొలిసారిగా 2005లో తమ వేరాన్ కారును మార్కెట్‌కు పరిచయం చేసింది. వేరాన్ మోడల్ ఉత్పత్తిని కంపెనీ కేవల 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ సూపర్‌కార్ ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం దీని ఉత్పత్తిని పరిమితం చేశారు.

బుగాటి వేరాన్‌లో నాలుగు రకాల వేరియంట్లు ఉన్నాయి, అవి - 1101 పిఎస్ వేరాన్, 2005 మోడల్ 16.4, వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ మరియు 2008 మోడల్ ఒరిజినల్ వేరాన్ యొక్క రోడ్‌స్టర్ వెర్షన్. వీటిలో ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కారు 1200 పిఎస్ వేరాన్ సూపర్ స్పోర్ట్. ఇది 2010 మోడల్. ఫాస్టెస్ట్ ఓపెన్‌టాప్ ప్రొడక్షన్ కారు విషయానికి వస్తే, అది వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విటెస్స్. ఇది 2012 మోడల్.

Most Read Articles

English summary
The last ever Bugatti Veyron Grand Sport Vitesse, "La Finale" has been sold to a customer from the Middle East. This is the 450th Veyron as well as the last one from the company. After a surprising number of special editions since its launch in 2005, the mighty Bugatti Veyron is at the end of its life cycle.
Story first published: Thursday, February 26, 2015, 11:16 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X